iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ.. CM రేవంత్ కీలక ఆదేశాలు

  • Published Dec 12, 2023 | 9:20 AM Updated Updated Dec 12, 2023 | 9:36 AM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయగా.. తాజాగా రుణమాఫీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయగా.. తాజాగా రుణమాఫీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఆ వివరాలు..

  • Published Dec 12, 2023 | 9:20 AMUpdated Dec 12, 2023 | 9:36 AM
Rythu Runa Mafi: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ.. CM రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల వేళ ఇచ్చిన హమీల అమలు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, చేయూత పథకాలను అమలు చేయగా.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం కోసం ఖర్చు పరిధిని రూ.10 లక్షలకు పెంచూతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా పెట్టుబడి సాయం రైతు భరోసా నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అలానే మరో ముఖ్యమైన హామీ అమలుకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అది ఏంటంటే.. రైతు రుణమాఫీ..

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీకి సంబంధించి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన రైతుభరోసాపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయశాఖ విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా, రుణమాఫీపై అధికారలుతో చర్చించారు. త్వరలోనే దీనికి సంబంధించి నివేదిక అందజేస్తే.. కార్యచరణ ప్రారంభిస్తామని రేవంత్ అధికారులకు సూచించనట్లు తెలుస్తోంది. అంటే త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రైతులకు శుభవార్త చెప్పనున్నారని అర్థం అవుతోంది. ఇక రైతులకు యాసంగి సీజన్‌ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అయితే ఎన్నికల వేళ తాము రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చామని.. కానీ దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కానందువల్ల ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అంతేకాక తెలంగాణలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలన్నారు సీఎం రేవంత్.

గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద అయిదు, పది ఎకరాల్లోపు వారికి ఎంతెంత అందించారో స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఈ సమావేశం సందర్భంగా రేవంత్.. అధికారులకు సూచించారు. అన్నదాతలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యాసంగి సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత నివారించాలని, పంటలకు సక్రమంగా సాగునీరు అందేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి రైతుబంధు నిధుల విడుదలను అధికారులు ప్రారంభించారు. ఫలితంగా 70 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల మేరకు చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. త్వరలోనే రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ కానున్నాయి అంటున్నారు అధికారులు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet