iDreamPost
android-app
ios-app

CM రేవంత్ రెడ్డి గొప్ప మనసు.. AP మహిళకు తెలంగాణలో ఉద్యోగం!

  • Published Jan 09, 2024 | 6:19 PM Updated Updated Jan 09, 2024 | 6:19 PM

సాధారణంగా ఒక రాష్ట్రంలోని ప్రజలకు మరో రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగం రావడం అనేది సాధ్యం కాదు. కానీ, ఇప్పుడు తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏపీ మహిళకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

సాధారణంగా ఒక రాష్ట్రంలోని ప్రజలకు మరో రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగం రావడం అనేది సాధ్యం కాదు. కానీ, ఇప్పుడు తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏపీ మహిళకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

  • Published Jan 09, 2024 | 6:19 PMUpdated Jan 09, 2024 | 6:19 PM
CM  రేవంత్ రెడ్డి గొప్ప మనసు.. AP మహిళకు తెలంగాణలో ఉద్యోగం!

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనను అద్భుతంగా కొనసాగిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రతి వారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి వేల సంఖ్యలో.. ప్రజలు తమ ఇబ్బందులను దరఖాస్తు రూపంలో అందించారు. వాటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ ఉద్యోగం కోసం పెట్టుకున్న దరఖాస్తు విషయంలో.. సీఎం రేవంత్ రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. ఏపీ మహిళకు తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణా రాష్ట్రంలో రాచకొండ పోలీసు కమిషనరేట్.. అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ గా సొంగా శేఖర్ పనిచేశేవాడు. కాగా, సెప్టెంబరు 2021లో విధి నిర్వహణలో ఉండగానే.. రోడ్డు ప్రమాదంలో ఇతను ప్రాణాలు కోల్పోయాడు. దీనితో అతని కుటుంబం రోడ్డున పడింది. విధుల్లో ఉన్నపుడే అతను మరణించాడు కాబట్టి.. అతని భార్య ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని.. ప్రభుత్వానికి విన్నపం పెట్టుకుంది. అయితే, ఆమె స్వతహాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా. కాబట్టి, నిబంధనల ప్రకారం అప్పటి ప్రభుత్వం ఆమెకు ఉద్యోగాన్ని కల్పించడానికి సిద్ధపడలేదు. ఈ విషయంలో ఉన్నత అధికారుల నిర్ణయం తీసుకోవాలి అని ఎప్పటికప్పుడు ఈ విషయాన్నీ వాయిదా వేసుకుంటూ వచ్చేవారు. అయితే, ఈ సంఘటన జరిగి రెండున్నర సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆ మహిళకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు.

ఇక ఇటీవల జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో తన విన్నపాన్ని మరల వెల్లడించింది ఆ మహిళా. దీనిని పరిశీలించిన అధికారులు ఈ విషయాన్నీ సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఇక తాజాగా ఆమె కుటుంబ పరిస్థితుల గురించి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. వారి స్థితిని అర్థంచేసుకుని కొన్ని నిబంధనలను మార్చి ఆమెకు ఉద్యోగాన్ని కల్పించాలని రాచకొండ సీ‌పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ రాచకొండ అధికారులు.. ఆమెకు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం.. కల్పించాలని డీజీపీను ఆదేశించారు. దీనితో వెంటనే ఆమెను జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ నియామక ప్రతాలను అందజేశారు.

కాగా, నిబంధనలను సడలించి మరి ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన కారణంగా.. కల్పించిన ఉద్యోగంలో ఎటువంటి పొరపాట్లు రానివ్వకుండా పనిచేయాలని అధికారులు ఆమెకు సూచించారు. భవిష్యత్తులోను ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఏదేమైనా.. కష్టాల్లో ఉన్న మహిళను ఆదుకుని ఆమెకు తెలంగాణలోనే ఉద్యోగాన్ని కల్పించి సీఎం ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం నిజంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. మరి, ఏపీ మహిళకు తెలంగాణలో ఉద్యోగం కల్పించడంలో.. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.