iDreamPost
android-app
ios-app

Revanth Reddy: గ్రూప్స్‌, DSC వాయిదాపై సీఎం రేవంత్‌ క్లారటీ.. ఏమన్నారంటే

  • Published Jul 10, 2024 | 9:54 AM Updated Updated Jul 10, 2024 | 12:17 PM

Revanth Reddy About DSC: తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన చేస్తోన్న గ్రూప్స్‌, డీఎస్‌సీ పరీక్షల వాయిదాపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Revanth Reddy About DSC: తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన చేస్తోన్న గ్రూప్స్‌, డీఎస్‌సీ పరీక్షల వాయిదాపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Jul 10, 2024 | 9:54 AMUpdated Jul 10, 2024 | 12:17 PM
Revanth Reddy: గ్రూప్స్‌, DSC వాయిదాపై సీఎం రేవంత్‌ క్లారటీ.. ఏమన్నారంటే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో నిరుద్యోగులు ఒకరు అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా.. బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి.. దానికి ఓటేసింది. ఇక తాము అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని.. 2024 నాటికి డిసెంబర్‌ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు. ఇక నిరుద్యోగులు గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని.. డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. వీరికి విపక్షాలు మద్దతిస్తున్నాయి. నిరుద్యోగుల ఆందోళన మిన్నంటిని నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. పరీక్షల వాయిదా అంశంపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీని వాయిదా వేయాలని.. అలానే గ్రూప్‌ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ.. పలువురు విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. డీఎస్సీ వాయిదా వేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. దీని వెనక బీఆర్‌ఎస్‌, కోచింగ్‌ సెంటర్ల కుట్ర ఉందని ఆరోపించారు.

మంగళవారం (జులై 9) మహబూబ్‌నగర్ సభలో మాట్లాడిన రేవంత్.. పోటీ పరీక్షల వాయిదా డిమాండ్ వెనుక కుట్ర కోణం దాగి ఉందని.. కోచింగ్‌ సెంటర్ల మాఫియా.. కావాలని కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోందని మండి పడ్డారు. రెండు, మూడు నెలల పాటు పోటీ పరీక్షలను వాయిదా వేస్తే.. నెలకు రూ.100 కోట్లకు పైగా ఫీజుల రూపంలో సంపాదించొచ్చని పలు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు భావిస్తున్నారని.. అందుకే పరీక్షల వాయిదా కోసం కృత్రిమ ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే పరీక్షల వాయిదా కుదరదని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే.. తమ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే ఉద్దేశంతోనే.. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌ రావులు.. పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ కుట్రలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ యువతను రెచ్చగొట్టడం వల్లే గతంలో చాలా మంది యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే.. నిరుద్యోగ యువతను వాడుకోకుండా ఆ ఇద్దరూ కలిసి ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసిందని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. తాజాగా గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులు, డీఎస్సీ ద్వారా 11,500 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పుడు పోటీ పరీక్షలను వాయిదా వేస్తే రూ.వేలల్లో అప్పులు చేసి గ్రామాల నుంచి నగరానికి వచ్చి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş