Nidhan
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ సమస్యలకు చెక్ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఆయన ఓ డెసిజన్ తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ సమస్యలకు చెక్ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఆయన ఓ డెసిజన్ తీసుకున్నారు.
Nidhan
తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోర్టల్‌పై పలు విమర్శలు వచ్చాయి. ధరణి ద్వారా భూ రికార్డుల ప్రక్షాళనలో ఉన్న సమస్యలు పరిష్కారమవడం పక్కనబెడితే.. కొత్త సమస్యలు వస్తున్నాయని అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో దీని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ సమస్యలకు చెక్ పెడతారా? అసలు ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ఉంచుతుందా? తీసేస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ విషయంలో తాజాగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని డిసైడ్ అయిన ఆయన.. అందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్‌గా సీసీఎల్ఏ మెంబర్‌ను నియమించారు. అలాగే సభ్యులుగా ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్‌తో పాటు మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లను నియమిస్తూ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను అధ్యయనం చేయనున్న ఈ ఐదుగురు సభ్యుల కమిటీ.. వెబ్సైట్ పునర్నిర్మాణం మీద సిఫార్సులు చేయనుంది. కాగా, ధరణి పోర్టల్ మీద మొదటి నుంచి ఫోకస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ పోర్టల్ వల్ల మున్ముందు సమస్యలు రాకుండా చేయాలని ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. అధికారులతో పాటు నిపుణులతో సీఎం రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిస్కషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పొంగులేటి భూ సమస్యల మీద డీటెయిల్డ్‌గా స్టడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ధరణి సమస్యలపై సర్కారు ఓ కమిటీని వేసింది.
ఇక, 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నిర్దిష్ట సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. అనంతరం ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పూర్తి కచ్చితత్వంతో రికార్డులను తయారు చేశామని అప్పటి సర్కారు వెల్లడించింది. రాష్ట్రంలో 93 శాతం భూమి హక్కులు క్లియర్ చేశామని పేర్కొంది. ప్యూరిఫైడ్ డేటానే ధరణి పోర్టల్‌లో ఎంట్రీ చేశామని.. తప్పులకు ఛాన్సే లేదని తెలిపింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల ధరణి వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని వేసింది. అయితే ధరణి ప్లేస్‌లో భూమాత వెబ్ పోర్టల్ రూపకల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ ధరణి వల్ల వచ్చిన సమస్యలు రిపీట్ కావొద్దని ఇలా వ్యూహరచన చేసింది. మరి.. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: కాపురంలో చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య దారుణ నిర్ణయం