Somesekhar
తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి న్యూ రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణ కూడా మెుదలుపెట్టాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి న్యూ రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణ కూడా మెుదలుపెట్టాలని అధికారులకు సూచించారు.
Somesekhar
తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరబోతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కొరకు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తాము ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను 100 రోజుల్లో నెరవేర్చుతామని ఇప్పటికే చెప్పుకొచ్చారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణ కూడా మెుదలుపెట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్ ఆదేశాలు కూడా జారీచేశారు. డిసెంబర్ 28 నుంచి కొత్తగా రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డుల్లో ఉన్న తప్పులు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 28వ తారీఖు నుంచే రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి, కొత్త రేషన్ కార్డులు, నూతన పింఛన్లు, హౌసింగ్ పై గ్రామ సభలో నిర్ణయం తీసుకుని లబ్దిదారులను ఎంపిక చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణి చేసేందుకు, అవకతవకలు జరకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే సోమవారం(డిసెంబర్ 18) గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి(PAC) భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా.. ఒక్కో జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 50 వేల మంది దరఖాస్తులు చేసుకుని వేచి చూస్తున్నారు. అదీకాక పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో దాదాపు 60 వేల నుంచి 90 వేల వరకు దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డుల తీసుకునే వారి సంఖ్య కూడా భారీగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. అటు కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వారందరి ఎదురుచూపులకు తెరదించుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.