iDreamPost
android-app
ios-app

గుడ్‌న్యూస్.. విద్యుత్ బిల్లుల పెంపుపై CM రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

  • Published Oct 29, 2024 | 10:37 AM Updated Updated Oct 29, 2024 | 10:37 AM

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.

  • Published Oct 29, 2024 | 10:37 AMUpdated Oct 29, 2024 | 10:37 AM
గుడ్‌న్యూస్.. విద్యుత్ బిల్లుల పెంపుపై CM రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ‘ఆరు గ్యారెంటీ ’పథకాలపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. ఇలా వరుసగా తనదైన మార్క్ చాటుకుంటున్న రేవంత్ రెడ్డి దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు.  పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల కరెంట్ చార్జీల పెంపుపై నెలకొన్న ఉత్కంఠకు తెర దింపారు. తాజాగా కరెంట్ చార్జీల పెంపుపై ఈఆర్సీ క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ చార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదన ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ విద్యుత్ చార్జీలు పెంచే యోచన లేదని ఈఆర్సీ క్లారిటీ ఇచ్చింది. అయితే డిస్కంలు దాఖలు చేసిన మొత్తం 8 పిటీషన్లపై 2024, అక్టోబర్ 28న ఈఆర్సీ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఈ విషయం గురించి ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపుపై రక రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. స్థిర ఛార్జీలు రూ.10 అలాగే ఉంటాయి, అన్ని పిటీషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా నిర్ణయం తీసుకున్నాం. 40 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారుల, ప్రభుత్వ సబ్సిడీలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని కమీషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎనర్జీ ఛార్జీలు ఏ కెటగిరిలోనూ పెంచడం లేదు, స్థిర చార్జీలు రూ.10 అలాగే ఉంటాయి.

ఇక గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలు తొలగించాం. కాకపోతే పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్ లను కమిషన్ ఆమోదించలేదు.. హెచ్‌టీ కేటగిరిలో వచ్చిన పిటీషన్స్ మాత్రం రిజక్ట్ చేశాం. అదే విధంగా 132 కెవిఎ, 133 కెవిఎ, 11కెవి లలో మాత్రం గతంలో ఉన్న చార్జీలే ఉంటాయి’ అని చెప్పారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నాన్ పీక్ అవర్ లో రూపాయి నుంచి 1:50 రాయితీ పెంచామన్నారు. గ్రిడ్ సపోర్ట్ చార్జీలపై కమీషన్ ఆమోదం తెలిపిందని అన్నారు. ఇక చేనేత కార్మికులకు హార్స్ పవర్ 10 నుంచి హెచ్‌పీ25 కి పెంచామని తెలిపారు. కాగా, డిస్కంలు రూ.57,728.90 పిటీషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183,28 కోట్లకు ఆమోదించిందని శ్రీరంగరావు తెలిపారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పలు మార్లు కరెంట్ చార్జీలు పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  ఏది ఏమైనా ఇప్పటి వరకు కరెంట్ చార్జీలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ రావడంతో తెలంగాణ ప్రజలు ఊపరి పిల్చుకున్నారు.