Nidhan
రూ.500కే సిలిండర్, ఫ్రీ కరెంట్ స్కీమ్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చేవెళ్ల సభలో ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు రేవంత్ ఏమన్నారంటే..
రూ.500కే సిలిండర్, ఫ్రీ కరెంట్ స్కీమ్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చేవెళ్ల సభలో ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు రేవంత్ ఏమన్నారంటే..
Nidhan
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు రూ.500కే ఎల్పీజీ సిలిండర్ కూడా ఉన్నాయి. వీటి అమలు కోసం రాష్ట్రంలోని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపో మాపో దీనిపై క్లారిటీ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో చేవెళ్ల సభలో ఈ పథకాల మీద ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టత ఇచ్చారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్‌ను ప్రజలకు అందిస్తామనన్నారు. ఎవరైనా అధికారులు ఈ పథకాలు మీకు రావని చెబితే.. వారిని నిలదీసి అడగాలని సీఎం చెప్పారు. చేవేళ్ల సభలో రేవంతన్న హామీ ఇచ్చారని ఆ ఆఫీసర్స్‌తో చెప్పాలని ఆయన సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
రూ.500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్.. ఈ రెండు పథకాలు అందకపోతే ప్రజలు అందోళన చెందొద్దని సీఎం రేవంత్ అన్నారు. ఎంఆర్వో లేదా ఎంపీడీవో ఆఫీసులకు వెళ్లి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించాలని తెలిపారు. ఎవరైనా మీకు ఈ స్కీమ్స్ రావని చెబితే.. ఆ అధికారులను నిలదీయాలని రేవంత్ స్పష్టం చేశారు. చేవెళ్లలో సభలో రేవంతన్న ఈ హామీ ఇచ్చారని ఆ ఆఫీసర్స్‌తో చెప్పాలని ప్రజలకు సూచించారు సీఎం. ఈ సభలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు నెగ్గి చూపించాలని కేటీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కార్యకర్తల అండ ఉన్నంత వరకు తన కుర్చీని ఎవరూ టచ్ చేయలేరని ఆయన వార్నింగ్ ఇచ్చారు. నల్లమల అడవి నుంచి మెట్టు మెట్టు ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు రేవంత్.
చేవెళ్లలో ఏర్పాటు చేసిన ‘జన జాతర’ సభలో రేవంత్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అంటే అల్లాటప్పా అనుకోవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని.. తనను తక్కువ అంచనా వేయొద్దన్నారు. చంచల్‌గూడ జైలులో పెట్టినా లొంగిపోకుండా పోరాడానని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో ఎన్నికల ముందు ఉన్న జోష్ ఇంకా కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పవర్లోకి రావడంలో కార్యకర్తల కష్టం ఎంతో ఉందన్నారు. వాళ్ల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే నెరవేరుస్తారని.. ఆరు గ్యారెంటీల అమలు మీదే ఫోకస్ పెట్టామని రేవంత్ వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 25 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చామని వ్యాఖ్యానించారు. అతి త్వరలో మెగా డీఎస్సీని ప్రకటిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. మరి.. ఉచిత కరెంట్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: New Ration Cards: సీఎం రేవంత్ కీలక ప్రకటన.. కొత్త రేషన్ కార్డులు ఆ తేదీ నుంచే