iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డు.. డిజిటల్ కార్డు రెండూ ఒకటి కాదు : CM రేవంత్ రెడ్డి

  • Published Oct 04, 2024 | 12:27 PM Updated Updated Oct 04, 2024 | 12:29 PM

Family Digital Card: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తాజాగా తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Family Digital Card: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తాజాగా తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

  • Published Oct 04, 2024 | 12:27 PMUpdated Oct 04, 2024 | 12:29 PM
రేషన్ కార్డు.. డిజిటల్ కార్డు రెండూ ఒకటి కాదు : CM రేవంత్ రెడ్డి

తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారు. త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు తెలిపారు. తాజాగా తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకు వేసి అత్యుత్తమ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సంకల్పించింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం, ఒకే గుర్తింపు కార్డు జారీకి ఏర్పాట్లు చేయనుంది. నిరుపేద ప్రజలు సులభంగా రాష్ట్రంలో ఎక్కడైనా అన్నిరకాల సేవలు పొందే విధంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే  రేష్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రెండూ వేరు అని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మిగతా వాటి అమలు పని చేసే విధంగా డిజిటల్ కార్డులు ఉంటాయని అంటున్నారు. రేషన్ కార్డు తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది.. ఆ కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత నంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలు అన్ని జాగ్రత్తగా సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికే అందాలనే ఉద్దేశంతో డిజిటల్ కార్డు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హరియానా రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల విధానం కొనసాగుతుంది. ఈ విధానాన్ని అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని చూస్తుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతానికి వైద్యారోగ్య, పౌరసరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు కార్డులు అందించాలని నిర్ణయించింది. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు గా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు సికింద్రాబాద్‌లో ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో వీటిని రీప్లేస్ చేయనుంది. ఈ డిజిటల్ కార్డుల సర్వేలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు కొంతమంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది.

రేషన్ కార్డ్ అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే కార్డు. ఈ కార్డు రేషన్  బ్యాంకు ఖాతా, స్కూల్స్ – కాలేజ్, ఓటర్ ఐడీ, సీమ్ కార్డులు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. నిరుపేదలకు రేషన్ కార్డు బలమైన గుర్తింపు పత్రం అనొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతూ రాగా.. మొన్న గాంధీ జయంతి నాటికి ఈ ప్రక్రియ నిలిపివేసింది. కొత్త రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే పనిలో ఉంది.