Rythu Runamafi: రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం! రైతుల్లో సంబరాలు!

రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం! రైతుల్లో సంబరాలు!

Rythu Runamafi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా రైతు సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది. రైతులకు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.

Rythu Runamafi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా రైతు సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది. రైతులకు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. తమపై ఎంతో నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం అంటూ పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి అంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చింది. అన్నట్టుగానే సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపైనే చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. ఎన్నికల హామీల్లో ప్రధానమైనది రూ.2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేశారు. మూడు విడతల్లో ఈ హామీ పూర్తయ్యింది. తాజాగా రైతన్నలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది. విడతల వారీగా రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 5న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అందజేశారు. అర్హులైన 11 లక్షల 50 వేల మంది రైతులకు రూ.6098 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే కొంతమంది రైతులకు అర్హత ఉండి కూడా రుణమాఫీ కాలేదు. దీనికి టెక్నికల్ కారణాలు ఉన్నాయని అధికారలు అంటున్నారు. అన్ని అర్హతలు ఉండి.. రుణమాఫీ కాని రైతులకు సరికొత్త ప్లాన్ రచించారు. రైతులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు గత జులై 15న జారీ చేసిన జీవో నంబర్ 567 కు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొంది. ఆదార్ కార్డు తప్పుంటే.. రైతుల వద్దకు వెళ్లి దాన్ని పరిశీలించి మళ్లీ తీసుకోవాలని, ఓటర్ కార్డు, వాహన లైసెన్స్, రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి తీసుకోవాలని పోర్టల్ లో సబ్మిట్ చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ స్టేట్ మెంట్ తో తెలంగాణ రైతుల్లో సంతోషాలు వెల్లువిరిశాయి.. సంబరాలు చేసుకుంటున్నారు.

Show comments