Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో శరవేగంగా కృషి చేస్తుంది. అయితే తాజాగా మరో పథకం పై సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఓ శుభవార్త చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో శరవేగంగా కృషి చేస్తుంది. అయితే తాజాగా మరో పథకం పై సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఓ శుభవార్త చెప్పారు.
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో చకచక ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలను చెపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేశారు. అలాగే పేదలకు అండగా నిలిచి ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచారు. ఇక ఆ తర్వాత అభయహస్తం పేరిట ప్రజాపాలన కార్యక్రమన్ని పెద్ద ఎత్తునే చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఈరకంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలులోకి తీసుకొస్తున్నారు. అయితే తాజాగా మరో పథకం పై సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు శుభవార్త చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మహాలక్ష్మి పథకంలో భాగంగా.. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ తో పాటు రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ను ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకాలన్ని ఈనెల 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.కాగా, ఇప్పటికే కొన్ని చోట్ల కరెంట్ బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులైన అందరికీ జీరో బిల్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈ మేరకు బిల్ మిషన్స్ లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేశారు. ఇది ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు.. ఆటోమేటిక్ గా ఈ స్కీమ్స్ అమలవుతున్నాయి.ఇదిలా ఉంటే.. తాజాగా మహాలక్ష్మీ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పేద గృహిణులకు ప్రతి నెల రూ. 2500 ఇస్తానని ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తుతం దృష్టి పెట్టారట. ఇక అతి త్వరలో ఈ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఎన్నికల్లో సమయంలో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇవ్వడంతో.. ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తారని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇచ్చే హామీలపై సీఎం కసరత్తు మొదలుపెట్టారని, అలాగే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని సమచారం తెలుస్తోంది. కాగా, వీలైనంత త్వరలో లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇక రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని చెబుతోంది.మరి, త్వరలో మహిళలకు ప్రతినెల రూ.2500 ఇచ్చే పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.