iDreamPost
android-app
ios-app

CM రేవంత్ సంచలన నిర్ణయం.. నంది అవార్డులు ఇకపై గద్దర్ అవార్డులు!

Gaddar Awards In Telangana: కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Gaddar Awards In Telangana: కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM రేవంత్ సంచలన నిర్ణయం.. నంది అవార్డులు ఇకపై గద్దర్ అవార్డులు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే నంది అవార్డుల పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు. కానీ, ఆ అవార్డులను నంది అవార్డులు అనరని.. వాటిని ఇకపై గద్దరు అవార్డులు అంటారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ జయంతి సంరద్భంగా అవార్డుల ప్రదానం ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల గురించి అధికారిక ప్రకటన చేశారు.

రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సినీ ప్రముఖులు తనను కలిశారంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో నంది అవార్డులను పునరుద్ధరించాలంటూ ఇండస్ట్రీ పెద్దలు కోరిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ సమయంలో వారికి ఒక విషయం మాత్రం స్పష్టం చేశాను అన్నారు. “నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం అధికారికంగా అవార్డులు ఇస్తుంది. అయితే వాటిని గద్దర్ అవార్డులు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డులు అని పేరు పెట్టుకుని.. గద్దర్ అన్నను గౌరవించుకుందాం. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఇదే శాసనం.. నా మాటనే జీవో అని చెప్తున్నా” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గద్దర్ పేరిట అవార్డులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. ఏటా జనవరి 31 గద్దర్ జయంతి రోజున ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది.

మరోవైపు ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహ ఏర్పాటుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఈ సభా వేదిక నుంచి ప్రకటించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ తొలి విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రజాగాయకుడు గద్దర్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి చేసిన గద్దర్ అవార్డుల ప్రకటపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. వేదిక మీదే అప్పుడే వెళ్లి రేవంత్ రెడ్డికి దన్యవాదాలు చెప్పడమే కాకుండా.. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కు సరైన గౌరవం దక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.