iDreamPost
android-app
ios-app

త్వరలో రెండో పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ హామీ!

త్వరలో రెండో పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ హామీ!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తెలంగాణ ఎన్జీవోలు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పే రివిజన్‌ కమిటీ ( పీఆర్‌సీ), హెల్త్‌ కార్డుల జారీ అంశాలపై వారితో చర్చించినట్లు సమాచారం. రెండో పీఆర్‌సీని ఏర్పాటు చేసి.. త్వరలో అమల్లోకి తేవాలంటూ.. మధ్యంతర భృతి కూడా ప్రకటించాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

తమ ఆరోగ్యం కోసం ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వీటితో పాటు ప్రభుత్వం తెచ్చిన సీపీఎస్‌ పెన్షన్‌ విధానాన్ని తొలగించి, ఓపీఎస్‌ విధానాన్ని తేవాలని కోరారట. అనంతరం ఉద్యోగ జేఏసీ నాయకులు ఓ కీలక ప్రకటన చేశారు. పీఆర్‌సీతో పాటు మధ్యంతర భృతి కూడా ఇస్తామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాదు! ఉద్యోగుల కోసం మెరుగైన ఆరోగ్య పథకాన్ని త్వరలో అమల్లోకి తెస్తామంటూ కేసీఆర్‌ చెప్పారన్నారు.

కాగా, మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు కోరిన వాటిని కూడా అమలు చేసే అవకాశం కూడా ఉంది. రెండో పీఆర్‌సీతో పాటు ఇతర వాటిపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే ఉద్యోగుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. మరి, రెండో పీఆర్‌సీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులకు హామీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.