iDreamPost
android-app
ios-app

51 మందికి బీఫారాలు.. BRS అభ్యర్థులు వీరే!

  • Published Oct 15, 2023 | 2:42 PM Updated Updated Oct 15, 2023 | 2:42 PM
51 మందికి బీఫారాలు.. BRS అభ్యర్థులు వీరే!

తెలంగాణలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ముచ్చుటగా మూడోసారి గెలుపు కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించేందుకు బీఆర్ఎస్ గట్టి పట్టుమీదే ఉంది. తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తామని సీఎం కేసీఆర్ అంటున్నారు. నేటి సాయంత్రం హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభలో ఎన్నికల శంకారావన్ని పూరించనున్నారు. తాజాగా తెలంగాణ అసెబ్లీ ఎన్నికల్లో పోటి చేయబోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. వివరాల్లోకి వెళితే..

ఆదివారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థి కి రెండు బీ-ఫారాలు అందజేశారు.. చాలా జాగ్రత్తగా నింపాలని సూచించారు. మిగతా అభ్యర్థులకు రేపు బీ-ఫారాలు అందజేస్తామని అన్నారు. కేసీఆర్ తరుపు నుంచి గంప గోవర్థన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరుపు నుంచి ఎమ్మెల్సీ కవిత బీ-ఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రానివారు నిరాశపడవొద్దు.. వారికి ఎన్నో అవకాశాలు కల్పిస్తామని అన్నారు. సామరస్యపూర్వకంగా సర్ధుబాట్లు చేస్తామని అన్నారు. సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నారని.. వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వొద్దని అన్నారు.

ఉమ్మడి మెదక్, ఖమ్మం, నిజాబాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అంజేశారు. బీ-పారాలు అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, జాజాల సురేందర్, గణేష్ గుప్తా, ష‌కీల్, జిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, గంప గోవ‌ర్ధ‌న్, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, జైపాల్ యాద‌వ్, అంజ‌య్య యాద‌వ్, రాజేంద‌ర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, చంటి క్రాంతి కిర‌ణ్, మ‌హిపాల్ రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి,రేగా కాంతారావు, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి, పువ్వాడ అజ‌య్, లింగాల క‌మ‌ల్ రాజ్, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, మెచ్చా నాగేశ్వ‌ర్ రావు, హ‌రిప్రియ నాయ‌క్, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు అందుకున్నారు.