iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. వారందరికీ తులం బంగారం! ఎప్పటి నుండంటే..?

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కసరత్తులు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది.

గుడ్ న్యూస్.. వారందరికీ తులం బంగారం!  ఎప్పటి నుండంటే..?

తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ఆరు గ్యారెంటీలతో పాటు పలు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్..వాటిని అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో మహిళలకు, విద్యార్థినులకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచింది. రైతు బంధును కూడా అందిస్తోంది. తర్వలోనే 200 వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందివ్వనుంది. వంద రోజుల్లో ఆ హామీలన్నీ తీర్చాలన్న ఉద్దేశంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

అలాగే ఇప్పుడు ఆడబిడ్డలకు మరో శుభవార్త చెప్పనుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు కసరత్తులు స్టార్ట్ చేసింది. తెలంగాణలో రాష్ట్రంలోని నిరుపేత (దళిత,గిరిజన, బీసీ,ఓబీసీ, మైనార్టీ) కులాలకు చెందిన ఆడ పిల్ల వివాహాల కోసం తీసుకు వచ్చిన పథకం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్.  ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఈ లబ్దిదారులకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారాన్ని అందిస్తామన్న హామీని ఇచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానాలను నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. ఈ మేరకు అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.

 కల్యాణ మస్తు పథకం ద్వారా నగదుతో పాటు బంగారం అందించేందుకు ఎంత బడ్జెట్ అవుతుందో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ అంచనా వేయాలని అధికారులను కోరారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామన్నారు. గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణానికి కసర్తులు ప్రారంభించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కోరారు. అలాగే సొంత భవనాలకు అయ్యే ఖర్చును కూడా అంచనా వేయాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ గా తీసుకుని బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి