Keerthi
ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు నిధుల కోసం అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, కొందరి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి. కానీ, ఇంక మరికొందరి ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. కానీ , ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలసిందే. దీంతో రైతుబంధు నిధుల విడుదల ఆగిపోవడంతో అందోళనలో ఉన్న రైతులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది.
ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు నిధుల కోసం అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, కొందరి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి. కానీ, ఇంక మరికొందరి ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. కానీ , ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలసిందే. దీంతో రైతుబంధు నిధుల విడుదల ఆగిపోవడంతో అందోళనలో ఉన్న రైతులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది.
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజసంక్షేమం కోసం ఇచ్చి హామీలను శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలను చెపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో నిరంతరం శ్రమిస్తున్న రైతున్నాలకు కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో సర్కార్ చకచక ముందుకు సాగుతుంది. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతనని హామి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సర్కార్ ఇచ్చిన హామిల మేరకు రైతుబంధు నిధుల కోసం రాష్ట్ర అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా రైతుబంధు నిధుల విడుదలపై తెలంగాణ డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల కోసం అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, కొందరి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయి. కానీ, ఇంక మరికొందరి ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. కానీ , ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలసిందే. దీంతో రైతుబంధు నిధుల విడుదల ఆగిపోయింది. అయితే ఎన్నికల కోడ్ ఎత్తివేశాక జమ చేస్తారా ? లేదా ? అనే గందరగోళంలో రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదాతకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని.. మరో 5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి కూడా ఎన్నికల కోడ్ పూర్తికాగానే, రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పారు. కనుక రైతుల ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. అయితే ఖమ్మంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు రైతుబంధుపై క్లారిటీ ఇచ్చారు.
ఇక ఎన్నికల కోడ్ అనంతరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 200 యూనిట్లకు జీరో కరెంట్ బిల్లు అంటే నవ్వారని, తమ ప్రభుత్వం మాత్రం జీవో ఇచ్చి అమలు చేసిందని చెప్పారు. కాిగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సిరిసిల్ల మగ్గం కార్మికులకు పెండింగ్ నిధులును తమ ప్రభుత్వమే చెల్లించిందని, మహిళా స్వయం సహాయక బృందాలకు సంవత్సరానికి రూ.20 లక్షల కోట్లు ఇస్తామని అన్నారు. మరి, ఎన్నికల కోడ్ పూర్తివ్వగానే రైతుబంధు నిధులను జమ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.