Chicken Price Today: పండగ వేళ మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..

పండగ వేళ మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..

Chicken Price Today: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణలో చికెన్ థరలు భారీగా పడిపోయాయి. పండగ వేళ చికెన్ ధరలు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Chicken Price Today: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణలో చికెన్ థరలు భారీగా పడిపోయాయి. పండగ వేళ చికెన్ ధరలు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫంక్షన్లు, పార్టీలు, పండగలు, సండే రోజుల్లో నాన్ వెజ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి ఉంటుంది. ధర ఎంతైనా పర్వాలేదు.. సండే రోజు చికెన్ తినాల్సిందే అంటుంటారు నాన్ వెజ్ ప్రియులు. ఇక గత నెల వరకు కొండెక్కిన చికెన్ ధరలు చికెన్ ప్రియులకు షాకిచ్చాయి. దీంతో మాంసం ప్రియులు ఇబ్బంది పడ్డారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని చూస్తున్నవారికి గుడ్ న్యూస్. తెలంగాణలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. చికెన్ ధరలు భారీగా తగ్గివచ్చాయి. కిలో చికెన్ ధర ఎంత ఉందంటే?

పండగ వేళ మాంసం ప్రియులకు భారీ శుభవార్త. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. తెలంగాణలో ఒక్కసారిగా చికెన్ ధరలు పడిపోయాయి. గత నెలలో కేజీ చికెన్ ధర రూ. 300 పలుకగా నేడు ఆ ధరలు సగానికి పడిపోయాయి. ప్రస్తుతం డ్రెస్సింగ్ కోడి కేజీ రూ. 150గా ఉంది. స్కిన్ లెస్ ధర రూ. 160-180గా ఉంది. శ్రావణమాసం కావడంతో ప్రజలంతా పూజలు వ్రతాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ తినే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో కొనుగోళ్లు పడిపోయాయి. దాదాపుగా శ్రావణమాసం అంతా చికెన్ తక్కువ ధరకే లభించనున్నట్లు తెలుస్తున్నది. చికెన్ ధరలు తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Show comments