iDreamPost
android-app
ios-app

దీపావళి సెలవుల్లో మార్పు.. వరుసగా మూడు రోజులు..

ఇటీవల కాలంలో పండుగలన్నీ తగులు మిగులు రావడంతో గందరగోళంలో ఉంటున్నారు జనాలు. ఎప్పుడు చేసుకోవడం కన్నా.. ఎప్పుడు సెలవు మంజూరు చేస్తారా అన్న సందిగ్దత నెలకొంది. మొన్న దసరా, ఈ రోజు దీపావళికి కూడా ఇదే కన్వ్యూజన్.

ఇటీవల కాలంలో పండుగలన్నీ తగులు మిగులు రావడంతో గందరగోళంలో ఉంటున్నారు జనాలు. ఎప్పుడు చేసుకోవడం కన్నా.. ఎప్పుడు సెలవు మంజూరు చేస్తారా అన్న సందిగ్దత నెలకొంది. మొన్న దసరా, ఈ రోజు దీపావళికి కూడా ఇదే కన్వ్యూజన్.

దీపావళి సెలవుల్లో మార్పు.. వరుసగా మూడు రోజులు..

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. చీకటిని పారద్రోలుతూ..వెలుగు తెచ్చే పండుగగా దీవాళిని జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు, విభిన్నరీతుల్లో ఫెస్టివల్‌ను చేసుకుంటారు. నరకాసురడనే రాక్షసుడిని సత్యభామ వధించిన కారణంగా.. అతడి పీడ వదిలిందన్న ఆనందంలో ఈ పండుగ చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆ పండుగ నాడు దీపాలతో ఇంటిని అలంకరించి, మహాలక్ష్మి పూజలు చేస్తారు. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. మిఠాయిలు పంచుకుంటారు. అనంతరం టపాసులను వెలిగిస్తూ.. వేడుక చేసుకుంటారు. భక్తి విశ్వాసాలతో పిల్లలు, పెద్దలు ఆనందోత్సవాలతో దీపావళి పండుగను జరుపుకుంటారు.

అయితే ఇటీవల ఫెస్టివల్స్ అన్నీ తగులు మిగులు రావడంతో ఎప్పుడు నిర్వహించుకోవాలి, ఎప్పుడు సెలవు వర్తిస్తుందన్న గందరగోళంలో ఉద్యోగులు ఉంటున్నారు. ఈసారి దీపావళి నవంబర్ 12, 13 తేదీల్లో వచ్చింది. ఈ రెండు రోజులు పండుగను నిర్వహించుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12 ఆదివారం రావడంతో సెలవు పోయినట్లు అయ్యింది. 13న చేసుకునే వారికి సెలవు పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సెలవుల్లో మార్పు చేసింది. ఈ నెల 13 అనగా సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో వరుసగా ప్రభుత్వ ఉద్యోగులకు, టెకీలకు మూడు రోజుల సెలవులు వచ్చినట్లు అయ్యింది. ఈ నెల 11 రెండో శనివారంతో పాటు ఆది, సోమ వారాలు హాలిడేస్ అన్నమాట. విద్యా సంస్థలకు కూడా ఈ 3 రోజులు సెలవులు. ఏపీలో కూడా సోమవారం సెలవు ప్రకటించింది జగన్ సర్కార్.