iDreamPost
android-app
ios-app

భయం వొద్దు.. వరదల్లో కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు ఈ నెలలోనే..

  • Published Sep 04, 2024 | 11:50 AM Updated Updated Sep 04, 2024 | 11:50 AM

Khammam Floods: తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారింది. కొన్ని జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో పూర్తిగా జలమయం అయ్యాయి. ము

Khammam Floods: తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారింది. కొన్ని జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో పూర్తిగా జలమయం అయ్యాయి. ము

  • Published Sep 04, 2024 | 11:50 AMUpdated Sep 04, 2024 | 11:50 AM
భయం వొద్దు.. వరదల్లో కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు ఈ నెలలోనే..

తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారింది. కొన్ని జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో పూర్తిగా జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, రూరల్ మండలాన్ని మున్నేరు వాగు ముంచెత్తింది. మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. మరికొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్స్ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. దీంతో విద్యార్థులు లబోదిబో అంటున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. వివరాల్లోకి వెళితే.

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా మున్నేరు వాగు ముంచెత్తడంతో ప్రజా జీవనం స్తంభించిపోయింది. మున్నేరు వాగు ముంచెత్తడంతో 50 కాలనీల్లోకి నీరు చేరడంతో చాలా మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వరద తగ్గిన తర్వాత ఇళ్లకు చేరుకున్నారు. అప్పటికే వారి ఇండ్లల్లో ఉన్న సర్టిఫికెట్స్ కొట్టుకుపోయి, తడిసి ముద్దయ్యాయి. అలాగే పుస్తకాలు, కోచింగ్ మెటీరియల్, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు కొటుకు పోవడం, పాడైపోవడం జరిగింది. దీంతో విద్యార్ధులు సర్టిఫికెట్స్ విషయంలో భయపడుతూ కన్నీరు పెట్టుకున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

మున్నేరు వాగు పొంగిపోవడంతో ఖమ్మం, రూరల్ ఏరియాల్లో వరదలు ముంచెత్తాయి.   ఈ క్రమంలోనే విద్యార్థుల సర్టిఫికెట్స్ పై ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు తమ సర్టిఫికెట్స్ గురించి పట్టించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 11న కలెక్టరేట్ లో ప్రత్యేక శిభిరం నిర్వహిస్తున్నామని.. విదేశాలు, తదితర అవసరాలకు కావాల్సిన సర్టిఫికెట్లు కోసం హాట్ లైన్ నంబర్ తెలియజేయాలని.. వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు సమకూర్చుతామని చెప్పారు. మిగతా వారు ఈ నెల 11న కటెక్టరేట్ లో జరిగిగే శిభిరానికి తప్పకుండా హాజరు కావాలని సూచించారు.