iDreamPost
android-app
ios-app

పది ఫలితాల్లో మండల టాపర్‌గా కారు డ్రైవర్ కూతురు.. చదువుకునేందుకు సాయం చేయాలంటూ

  • Published May 01, 2024 | 6:25 PM Updated Updated May 01, 2024 | 6:25 PM

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇందులో ఎక్కువగా పేద, దిగువ మధ్యతరగతి నేపథ్యం ఉన్న వారే ఉండడం గమనార్హం. అయితే పది ఫలితాల్లో కారు డ్రైవర్ కూతురు ఏకంగా మండల టాపర్ గా నిలిచింది.

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇందులో ఎక్కువగా పేద, దిగువ మధ్యతరగతి నేపథ్యం ఉన్న వారే ఉండడం గమనార్హం. అయితే పది ఫలితాల్లో కారు డ్రైవర్ కూతురు ఏకంగా మండల టాపర్ గా నిలిచింది.

పది ఫలితాల్లో మండల టాపర్‌గా కారు డ్రైవర్ కూతురు.. చదువుకునేందుకు సాయం చేయాలంటూ

తెలంగాణలో పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఇందులో ఎక్కువగా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉండడం గమనార్హం. మేస్త్రి కూతురు, ఆటో డ్రైవర్ కొడుకు.. తాజాగా కారు డ్రైవర్ కూతురు ఇలా వీళ్లంతా తమని కన్నవాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువులో రాణించారు. బాగా చదివితే ఫ్రీగా చదువుకోవచ్చునన్న ఉద్దేశంతో రాత్రనక పగలనక కష్టపడి చదివి స్కూల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులు ఉన్నారు. తాజాగా ఒక కారు డ్రైవర్ కుమార్తె తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఈ అమ్మాయి 9.8 జీపీఏతో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.

నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం వీటీ కాలనీకి చెందిన నాగేళ్ల సత్యనారాయణ, నాగేళ్ల మరియమ్మ దంపతుల ముద్దుల కుమార్తె కీర్తన ఈ అరుదైన ఘనత సాధించింది. నాగేళ్ల సత్యనారాయణ కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కీర్తన చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది కీర్తన. తన తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని.. తనను చదివించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెల్లడించింది. తాను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా అని.. అయితే తనను చదివించే ఆర్థిక స్థోమత తన తల్లిదండ్రులకు లేదని.. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందితే డాక్టర్ అయ్యి పది మందికి సహాయం చేసే స్థితిలో ఉంటానని నమ్మకం ఉందని కీర్తన తెలిపింది. ఎవరైనా సహాయం చేయదలచుకుంటే చేయండి అంటూ సహాయం కోసం ఎదురుచూస్తుంది.

టీచర్స్ సపోర్ట్ వల్లే తాను టాపర్ గా నిలిచానని.. ఇంట్లో తల్లిదండ్రులు.. మనం లేనివాళ్ళం.. చదువుతోనే నువ్వు పేదరికాన్ని పోగొట్టగలవు.. చదువే మనకి ఆధారం అని చెప్పడం వల్ల తాను కష్టపడి చదివానని తెలిపింది. టీచర్స్ కూడా తనను బాగా చదివేలా మోటివేట్ చేశారని.. అందువల్లే టాపర్ గా నిలిచానని ఆమె తెలిపింది. వాస్తవానికి 10 జీపీఏ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా అని.. కానీ కొన్ని సమస్యల వల్ల మిస్ అయ్యిందని ఆమె తెలిపింది. అయితే ఇంటర్ లో తీసుకునే గ్రూప్ ద్వారా ఎక్కువ మార్కులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. తాను అనుకున్నది సాధించడం కోసం డే అండ్ నైట్ కష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక తమ కూతురు టాపర్ గా నిలవడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

అదే సమయంలో చదివించే స్థోమత లేక బాధపడ్డారు కూడా. కీర్తన తల్లి మాట్లాడుతూ.. తమ బిడ్డ పది ఫలితాల్లో స్కూల్ ఫస్ట్ రావడం సంతోషంగా ఉందని.. అయితే తన కూతుర్ని చదివించే స్థోమత తమకు లేదని.. ఎవరైనా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నా అని ఆమె అన్నారు. సాయం చేస్తే తమ బిడ్డని డాక్టర్ ని చేస్తామని.. తను పది మందికి సేవ చేసి గొప్ప స్థాయిలో నిలబడాలని ఆశిస్తున్నామని అన్నారు. మరి పది ఫలితాల్లో సత్తా చాటిన కారు డ్రైవర్ కుమార్తె కీర్తన తను అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని.. అందుకోసం ప్రభుత్వం గానీ ఇంకెవరైనా గానీ ఆర్థిక సాయం చేస్తారని ఆశిద్దాం.