iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తున్నారా! ముహూర్తం ఫిక్స్!

  • Published Mar 12, 2024 | 9:01 PM Updated Updated Mar 12, 2024 | 9:01 PM

Good News for Ration Card Holders: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Good News for Ration Card Holders: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తున్నారా! ముహూర్తం ఫిక్స్!

గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టింది. మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీ నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విపరీతమైన స్పందన వచ్చింది.  మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంపై జరుగుతున్న చర్చలకు పులిస్టాప్ పెట్టారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు అవుతుంది. నాటి నుంచి కొత్త రేషన్ కార్డులపై తర్జన భర్జన జరుగుతూనే ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తామని చెప్పడంతో కార్డులు లేని వారు ఆ పథకాలను అందుకోలేకపోతున్నారు.

Revanth reddy fix new ration cards date

ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. నేడు నిర్వహించిన కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలిపారు. అంతేకాదు 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం తీసుకుంది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్ల మంజూరుకు ఆమయోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పోరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పట్లపై నిర్ణయాలు తీసుకున్నారు. కేబినేట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి అమోదం తెలపడంపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.