iDreamPost
android-app
ios-app

పొలాల్లోకి దూసుకెళ్లిన TSRTC బస్సు.. బస్సులో 60 మంది..!

దేశంలో అనారోగ్య సమస్యలతో కన్నా.. రోడ్డు ప్రమాదాల కారణంగానే చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదు అవుతుంది. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వాహనంపై అదుపు కోల్పోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, తాగి వాహనాలు నడపడం ప్రధాన కారణాలు. అయితే ప్రభుత్వం నడుపుతున్న ఆర్టీసీ బస్సులు కూడా..

దేశంలో అనారోగ్య సమస్యలతో కన్నా.. రోడ్డు ప్రమాదాల కారణంగానే చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదు అవుతుంది. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వాహనంపై అదుపు కోల్పోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, తాగి వాహనాలు నడపడం ప్రధాన కారణాలు. అయితే ప్రభుత్వం నడుపుతున్న ఆర్టీసీ బస్సులు కూడా..

పొలాల్లోకి దూసుకెళ్లిన TSRTC బస్సు.. బస్సులో 60 మంది..!

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్లలో వెహికల్ డ్రైవ్ చేయడం, నిద్ర లేమితో వాహనంపై నడుపుతూ.. నియంత్రణ కోల్పోవడం ఈ యాక్సిడెంట్లకు కారణమౌతున్నాయి. అయితే ప్రజా భద్రతే ధ్యేయంగా పేర్కొంటున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదానికి గురౌతున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. తాజాగా తెలంగాణలో తృటిలో ఆర్టీసీకి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. వరంగల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణీకులతో హన్మకొండ నుండి ఏటూరు నాగారం వెళ్లి దారిలో ఒగ్లపూర్ వద్ద అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. అక్కడే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. అయితే ఇందులో మహిళలే ఎక్కువ ఉన్నారని తెలుస్తోంది. అతివేగంగా వెళ్తున్న బస్సు.. ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించే సమయంలో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు.. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

bus accident at warangal

అయితే ఆర్టీసీ అధికారులు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే కొంత మంది ఓవర్ లోడింగ్ కూడా కారణమని, బస్సులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని చెబుతున్నారు. అయితే తృటిలో పెను ప్రమాదమైతే తప్పింది. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది కాబట్టే.. వీరంతా ప్రాణాలతో బయటపడ్డారని, లేకుంటే ఊహించలేనంత విషాదం నెలకొనేదని స్థానికులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు జర్నీలు అందించిన వేళ.. ఇలాంటి ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ మీరేమంటారో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.