iDreamPost
android-app
ios-app

నర్సాపూర్ KCR సభలో బుల్లెట్ల కలకలం!

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారంలో తరచూ ఏదో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంటుంది. ఇప్పటికే మూడు సార్లు ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. తాజాగా ఆయన నిర్వహించి నర్సాపూర్ సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారంలో తరచూ ఏదో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంటుంది. ఇప్పటికే మూడు సార్లు ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. తాజాగా ఆయన నిర్వహించి నర్సాపూర్ సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి

నర్సాపూర్ KCR సభలో బుల్లెట్ల కలకలం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గురువారం ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో పర్యటించారు. అక్కడ  నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే ఆ సభలో అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. నిందితుడిని విచారించిన అనంతరం పూర్తి వివరాలు పోలీసులు వెల్లడిస్తారని తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తనదైన మాటలతో ప్రత్యర్థి పార్టీలపై కేసీఆర్ విరుచక పడుతున్నారు. గులాబీ బాస్ గేర్ మార్చి.. రోజుకు రెండు, మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ కొన్ని సందర్భాల్లో ఆయన ప్రచారానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక సమస్యకు గురైంద. ఇలా కేవలం ఒక్కసారి కాదు.. ఏకంగా మూడు సార్లు జరిగింది. అదిలాబాద్, బోధన్,మహబాబు నగర్ పర్యటన సమయంలో హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. తాజాగా మెదక్ లోని నర్సాపూర్ సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేసీఆర్ నర్సాపూర్‌ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయట పడ్డాయి.

కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండటం పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన వ్యక్తని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ సభ ముగిసిన తరువాత ఇవి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నర్సాపూర్ లో వి.సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా కేసీఆర్ నర్సాపూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభకు హాజరయ్యారు. మరి.. సీఎం సభలో బుల్లెట్లు కలకలం సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.