iDreamPost
android-app
ios-app

గీతం యూనివర్సిటీలో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య

  • Published Jan 05, 2024 | 5:27 PM Updated Updated Jan 06, 2024 | 6:01 AM

Hyderabad GITAM student Renu Sri: సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

Hyderabad GITAM student Renu Sri: సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

  • Published Jan 05, 2024 | 5:27 PMUpdated Jan 06, 2024 | 6:01 AM
గీతం యూనివర్సిటీలో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కలవరపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిసి కూడా జీవితంపై విరక్తితో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు అప్పుల బాధతో, మరికొందరు ఆర్థిక, కుటుంబ సమస్యలతో విసిగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైనా, చదువులో రాణించలేకపోతున్నామనే ఆందోళనతో సూసైడ్ కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అందరు చూస్తుండగానే కాలేజీ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని రేణు శ్రీ గా గుర్తించారు. ఆమె గీతంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో గాని ఆ విద్యార్థిని షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఆ విద్యార్థిని ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా ఆత్మహత్యకుపాల్పడిన విద్యార్థిని భవనంపై నుంచి దూకుతుండగా క్యాంపస్ లోని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గీతం యూనివర్సిటీ అధికారులు ఘటన సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet