P Krishna
P Krishna
దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, విజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక తెలంగాణలో ఎన్నికల హడావుడి షురు అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేటి నుంచి ఎన్నికల శంకారావాన్ని పూరించనుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ లో నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతుందని ఈసీఈ వెల్లడించింది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమైపోయాయి. తెలంగాణలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దితుగున్నారు. నేడు ఆదివారం 15 నుంచి మొదలు పెట్టి 8 వరకు ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ గడ్డ నుంచే సీఎం కేసీఆర్ ఎన్నికల శంకారావాన్ని పూరించనున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.. సీఎం కేసీఆర్ కి బాగా సెంటిమెంట్ స్థానం. అందుకే 2023 ఎన్నికల్లో మూడోసారి గెలుపు కైవసం చేసుకోవడానికి తొలి బహిరంగ సభ ఇక్కడే నిర్వహంచాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇక్కడ నుంచి ‘ప్రజా ఆశీర్వాద సభ’ పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక ఎన్నికల ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. భారీ బహిరంగ సభ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హుస్నాబాద్ కి తరలివెళ్తున్నారు. మొదటి సభను గ్రాండ్ సక్సెస్ చేయడానికి సిద్దం చేస్తున్నారు.