BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్.. కారణం ఇదే..!

BRS Mlas Brother Arrested: కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం.. అనుమతి గడువు పూర్తయినా మైనింగ్ చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

BRS Mlas Brother Arrested: కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం.. అనుమతి గడువు పూర్తయినా మైనింగ్ చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వివిధ కార్యక్రమాలపై పూర్తిగా సమీక్షలు నిర్వహిస్తుంది. నాటి ప్రభుత్వం హయాంలో జరిగిన దుర్వినియోగంపై ఆరా తీస్తుంది. తాజాగా తెలంగాణ రాజీకీయాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మధుసూధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డి అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్దంగా నడిపారనే కారణంగా మధుసూధన్ రెడ్డిన శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని.. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ రెడ్డిన చటింగ్, మైనింగ్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేయడం లాంటివి చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో క్వారీని అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఎమ్మార్వో పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేత మధుసూదన్ ని అరెస్ట్ చేయడంతో కార్యకర్తలు, ఆయన అనుచరులు అక్కడికి చేరుకున్నారు.

ఈ మధ్య మధుసూధన్ రెడ్డి తనయుడు పేరిట పఠాన్ చెరు మండలంలో లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుపై నిన్న రంగారెడ్డి జిల్లా ఆదిభట్ట పోలీస్ స్టేషన్ లో హత్యా ప్రయత్నం, భూ కబ్జా కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే కన్నారవు తో పాటు ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. మొత్తానికి చట్టం ముందు ఎవరైనా సమానమే అంటూ.. చట్టం పని తను చేసుకుపోతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

Show comments