iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదారాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదారాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు బాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదారాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. బీఆర్ఎస్ నేత చనిపోయాడని తెలుసుకున్న ఆ పార్టీ నేతలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో శుక్రవారం  సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో బాలకృష్ణా రెడ్డి కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. టికెట్ రాకపోవడంతో 2009లో బీఆర్ఎస్ పార్టీని వీడి.. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీని వీడి యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీని బీజెపీలో విలీనం చేశారు. 2023 అక్టోబర్ 20న తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న జన్మించారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో LB నగర్ నుండి డివీఎం డిగ్రీ & పీజీ కళాశాల నుండి బి.కామ్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.