BRS అధినేత రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల పాలన తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దానికి తోడు ఆయనకు ఇంట్లో ప్రమాదానికి గురి కావడంతో ఆపరేషన్ చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల పాలన తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దానికి తోడు ఆయనకు ఇంట్లో ప్రమాదానికి గురి కావడంతో ఆపరేషన్ చేశారు.

2023 తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ఓటమిపాలయ్యింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఎన్నికల సమయంలో స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ ముమ్ముర ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ క్రమంలో సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నారు కేసీఆర్. అదే సమయంలో ఎర్రవెల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో కాలు జారి కిందపడిపోయారు. తుంటి ఎముక రెండు చోట్ల విరగడంతో యశోద ఆస్పత్రిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దీంతో కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ప్రముఖ రాజకీయ, సినీ వర్గానికి చెందిన వారు ఆయన్ని పరామర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు తారుమారై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవాలంటే గులాబీ బాస్ రీ ఎంట్రీ ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న తన పుట్టిన రోజు పురస్కరించుకుని కేసీఆర్ జనం మధ్యకు మళ్లీ రానున్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ కి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేతలు, కార్యకర్తలు గులాబీ బాస్ ఎంట్రీకి భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ అధినేత మళ్లీ జనాల్లోకి వస్తే పార్టీ బలం మరింత పుంజుకుంటుందని పార్టీ నేతలు, కార్యకర్తలు తెగ ఆనందపడిపోతున్నారు. కాకపోతే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు మాత్రం రాలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments