iDreamPost
android-app
ios-app

తెలంగాణకు నూతన DGP.. ఉత్తర్వులు జారీ!

Telangana New DGP: తెలంగాణ ఎన్నికల ఫలితాల విడుదల వేళ డీజీపీ అంజనీకుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా కొత్త డీజీపీగా మరో ఐపీఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Telangana New DGP: తెలంగాణ ఎన్నికల ఫలితాల విడుదల వేళ డీజీపీ అంజనీకుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా కొత్త డీజీపీగా మరో ఐపీఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

తెలంగాణకు నూతన DGP.. ఉత్తర్వులు జారీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం పూర్తైంది. ఇక్కడ దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో డీజీపీ అంజనీ కుమార్ పై ఎన్నికల సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం సమయంలో డీజీపీ అంజనీకుమార్ రేవంత్ రెడ్డికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ డీజీపీ అంజనీ కుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుంధూబి మోగించింది. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇక బీజేపీ ఒకటి నుంచి  ఎనిమిది స్థానాలకు వచ్చింది. ఇది ఇలా ఉంటే.. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సమయంలో కాంగ్రెస్ మోజార్టీ స్థానాల్లో దూసుకెళ్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండటంతో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి విషెష్ తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే రేవంత్ రెడ్డిని డీజీపీ కలవడంపై  ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన అంజనీకుమార్ స్థానంలో అర్హతలు ఉన్న అధికారిని డీజీపీగా నియామించాలని తెలంగాణ సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారి రవిగుప్తను తెలంగాణ నూతన డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.