iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: Hyd అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెహదీ పట్నంలో ఉన్న అంకుర ఆసుపత్రి పై భాగంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ మార్గంలో ట్రాఫిక్ కారణంగా అగ్ని మాపక దళాలు చేరుకునేందుకు కాస్త సమయం పట్టింది.

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెహదీ పట్నంలో ఉన్న అంకుర ఆసుపత్రి పై భాగంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ మార్గంలో ట్రాఫిక్ కారణంగా అగ్ని మాపక దళాలు చేరుకునేందుకు కాస్త సమయం పట్టింది.

బ్రేకింగ్:  Hyd అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ మెహిదీ పట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  గుడి మల్కాపూర్‌లోని అంకుర ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. పై అంతస్థులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 10వ అంతస్థులో ఏర్పడిన మంటలు.. ఐదవ అంతస్థుకు అంటుకున్నాయి.  దట్టమైన పొగ మిగిలిన అంతస్థులను అలుముకుంటోంది. ఆసుపత్రి సిబ్బంది సైతం మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పేషెంట్స్ ఎంత మంది ఉన్నారు.. ఆ మంటల్లో ఎంత మంది చిక్కుకున్నారో వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

10వ అంతస్థులో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సైన్  బోర్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం కావడంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. మెహదీ పట్నం-అత్తాపూర్, మరో మార్గంలో ట్రాఫిక్ ఆగిపోవడంతో అగ్ని మాపక దళాలు అక్కడకు చేరుకునేందుకు సమయం పట్టింది. అంకుర ఆసుపత్రిలోని కేఫిటేరియా, గార్డెన్ ఉన్న  అంతస్థులో  ఈ అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలను అదుపు చేస్తున్నారు అగ్ని మాపక సిబ్బంది. ఇదే క్రమంలో అంకుర ఆసుపత్రిలో ఉన్న పేషేంట్లను హుటా హుటిన ఆసుపత్రి బయటకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఎవ్వరూ గాయపడలేదని సమాచారం. అయితే ఈ ఆసుపత్రిలో గర్బిణీలు, చిన్నారులు ఉంటారు. వారిని మెట్లు, లిఫ్ట్ ద్వారా బయటకు తీసుకువస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సుమారు వంద మందికి పైగా రోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş