HYDలో అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలను కాపాడిన బాలుడు

హైదరాబాద్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ బాలుడు సాహసం చేశాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ కంపెనీలో చిక్కుకున్న 50 మంది ప్రాణాలను కాపాడాడు.

హైదరాబాద్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ బాలుడు సాహసం చేశాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ కంపెనీలో చిక్కుకున్న 50 మంది ప్రాణాలను కాపాడాడు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ బాలుడు వయసుకు మించిన సాహసం చేశాడు. ఓ వైపు దట్టమైన మంటలు చెలరేగుతుంటే సమయస్ఫూర్తి చూపి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికంగా నివసించే సాయి చరణ్ అనే బాలుడు ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలను గమనించాడు. వెంటనే భవనంపైకి ఎక్కి తాడు కట్టి కిందికి వదిలాడు. ఆ తాడు సాయంతో మంటల్లో చిక్కుకున్న 50 మంది తాడు సాయంతో కిందికి దిగారు. అగ్ని ప్రమాదంలో బాలుడు సాహసం చేయకపోయుంటే వారందరూ ఆ మంటల్లో సజీవదహనమయ్యేవారు. ఆపద సమయంలో ధైర్యసాహసాలు చూపిన బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికిపైగా సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. ఆకస్మికంగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల్లో చిక్కుకున్న కొంతమంది సిబ్బంది తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కిటికీల్లోంచి దూకేశారు. ఈ సమయంలోనే బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. బిల్డింగ్ పైకి ఎక్కి తాడు కట్టిన బాలుడు మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాడు.

ఇక అగ్రి ప్రమాద ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానిక గల కారణం.. ఫార్మా కంపెనినీ ఆనుకుని ఉన్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు అంటుకున్నట్టు కార్మికులు వెల్లడిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేరకు ఆస్తి నష్టం, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో బాలుడు సాహసం చేసి 50 మంది ప్రాణాలను కాపాడిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments