iDreamPost
android-app
ios-app

మహబూబాబాద్‌లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్.. భయంతో వణికిపోయిన ప్రజలు!

  • Published Dec 21, 2023 | 11:42 AM Updated Updated Dec 21, 2023 | 12:05 PM

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో స్టోన్ క్రషర్స్ ద్వారా చుట్టు పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్కడ గుట్టలను పెకిలించేందుకు బాంబులు వాడుతుంటారు.. ఆ ధాటికి గ్రామాల్లో ప్రజలు భయపడిపోతుంటారు.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో స్టోన్ క్రషర్స్ ద్వారా చుట్టు పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్కడ గుట్టలను పెకిలించేందుకు బాంబులు వాడుతుంటారు.. ఆ ధాటికి గ్రామాల్లో ప్రజలు భయపడిపోతుంటారు.

  • Published Dec 21, 2023 | 11:42 AMUpdated Dec 21, 2023 | 12:05 PM
మహబూబాబాద్‌లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్.. భయంతో వణికిపోయిన ప్రజలు!

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్టోన్ క్రషర్స్ లో బాంబ్ బ్లాస్టింగ్స్ చేస్తుంటారు. దీంతో రాళ్లు గాల్లో ఎగురుతూ చుట్టుపక్కట ప్రాంతాల్లో పడుతుంటాయి. కొన్నిసమయాల్లో మనుషులపై పడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. అయితే బ్లాస్టింగ్ చేసే సమయంలో యాజమాన్యం తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు జరగి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ అధికారుల దృష్టికి వచ్చినప్పికీ అప్పటి వరకు గట్టిగా మందలించి వదిలేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ జరగడంతో చుట్టుపక్కల జనాలు భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి సమయంలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  స్టోన్ క్రషర్ వద్ద ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలతో బాంబ్ బ్లాస్టింగ్ జరగడంతో తామంతా భయపడిపోయామని.. కొన్ని ఇండ్లు బీటలు వారడంతో భయంతో బయటకు పరుగులు తీశామని గ్రామస్థులు తెలిపారు. బాంబు బ్లాస్టింగ్ శబ్ధాలకు పశువులు బెదిరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు  అర్ధరాత్రి స్టోన్ క్రషర్ వద్ద గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. తాము ప్రభుత్వ నుంచి అన్ని పరిమితులు తెచ్చుకున్నామని.. రిజిస్ట్రేషన్ ప్రకారమే స్టోన్ క్రషర్ ఉందని యాజమాన్యం చెబుతుంది. ఉదయం బ్లాస్టింగ్ చేస్తే.. చుట్టు పక్కల ప్రజలకు, జీవాలకు ఇబ్బంది ఏర్పడుతుందని రాత్రి తమ పని చేసుకుంటున్నామని యాజమాన్యం అంటున్నారు.

గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులో రేణుక స్టోన్ క్రషర్ యాజమాన్యం ఉంది. అయితే చుట్టుపక్కల గ్రామ ప్రజలను స్టోన్ క్రషర్ లో పేలుతున్న బాంబుల వల్ల ప్రమాదం పొంచి ఉందని, పశువులు బెదిరిపోతున్నాయని, బండరాళ్లు పడి రోడ్లు పాడవుతున్నాయని,  దుమ్ము వల్ల  మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లుతుందని  రేణుక క్రషర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్థులు ఎప్పటి నుంచో అడ్డుకుంటున్నారు. కానీ మార్కెట్ లో స్టోన్ సప్లై కోసం యాజమాన్యం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. బుధవరాం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ తో 25 పైగా ఇళ్లు బీటలు వారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్టోన్ క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే గాజులగట్టు గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేంయడి.