P Krishna
Eatala Rajendar, Huzurabad, TS Election Result 2023 : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల కాంగ్రెస్ సత్తా చాటితే.. అధికార పార్టీ బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉంది. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది.
Eatala Rajendar, Huzurabad, TS Election Result 2023 : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల కాంగ్రెస్ సత్తా చాటితే.. అధికార పార్టీ బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉంది. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది.
P Krishna
తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఉత్కంగా కొనసాగుతున్నాయి. క్షణ క్షణం రిజల్ట్ మారిపోతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో ఆధిక్యత చాటుకుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు ప్రధాన పార్టీలు ప్రచారాలతో హూరెత్తించారు. అంతేకాదు గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో అనూహ్యంగా అంచనాలు తారుమారు అవుతున్నాయి. తెలంగాణలో మొదటి నుంచి రాజకీయాల్లో తనదైన సత్తా చాటుతూ వచ్చిన ఈటెల బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఆయన అంచనాలు తారుమారు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసిన ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వడితల ప్రణవ్ పోటీ చేశారు. ఎన్నికల ముగింపు సమయంలో కౌశిక్ రెడ్డి ప్రచారం తీవ్ర ప్రభావం చూపించిందని అంటున్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఈటెల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి 1061 లీడ్ లో కొనసాగుతున్నారు. దీంతో మొదటి నుంచి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశార ఈటెల, కానీ ఫలితాల్లో మాత్రం తేడా కొట్టాయి. అటు గజ్వేల్ నియోజకవర్గంలో సైతం ఈటెల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ సీఎం అభ్యర్థి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 629 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
2021 లో ఉపఎన్నికలో హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల పోటీ చేయగా 23,855 ఓట్ల మెజార్టీలో భారీ విజయం అందుకున్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నప్పటికీ తనను అన్యాయంగా బర్తరఫ్ చేశారని ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేత, సానుభూతి, స్థానికత ఇవన్నీ అప్పట్లో ఈటెలకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్లిన తర్వాత హుజూరాబాద్ లో గెలవడం బీజేపీకి గట్టి బలం చేకూరిందని అప్పట్లో టాక్ వచ్చింది. ఈటెల హూజూరాబాద్ లో 5 సార్లు, కమలాపూర్ లో 2 సార్లు గెలిచారు. కాగా, 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఈటెల వెనుకంజలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.