iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. సర్కార్ కీలక సూచన!

  • Published Jul 08, 2024 | 1:00 AM Updated Updated Jul 08, 2024 | 1:00 AM

Ration Card Holders: రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పేద ప్రజలకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. రేషన్ సరుకులు తక్కువ ధరకు లభిస్తాయి. వివిధ పథకాలకు రేషన్ కార్డు తప్పని సరి. దారిద్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి బీపీఎల్ రేషన్ కార్డు జారీ చేస్తారు.

Ration Card Holders: రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పేద ప్రజలకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. రేషన్ సరుకులు తక్కువ ధరకు లభిస్తాయి. వివిధ పథకాలకు రేషన్ కార్డు తప్పని సరి. దారిద్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి బీపీఎల్ రేషన్ కార్డు జారీ చేస్తారు.

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. సర్కార్ కీలక సూచన!

రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ కార్డు ద్వారా లబ్దిదారులకు ఆహార ధాన్యాలు, బియ్యం, కిరోసిన్ తో పాటు నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి. ఇవన్నీ రేషన్ షాన్ నుంచి రేషన్ కార్డు ద్వారా పొందవొచ్చు. ఈ కార్డులు దారిద్య్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిని గుర్తించి ఇస్తారు. రేషన్ కార్డు ప్రతి ప్రభుత్వ పథకానికి తప్పని సరి అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యూమెంట్స్ లో ఒకటి అని చెప్పొవచ్చు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు విసయంపై కీలక సూచన చేసింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వార్తలు ఏది నమ్మాలో..ఏది నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.  రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. రేషన్ కార్డుల్లో పేర్లు మార్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘రేషన్ కార్డుల్లో మార్పులకు ప్రభుత్వం శనివారం నుంచి అవకాశం కల్పించిందని.. మీ సేవా కేంద్రాల్లో ఇందుకు సంబంధంచిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైందని, రేషన్ కార్డుల్లో కొత్తగా అప్డేట్ చేసుకోదలచిన వారు.. పిల్లల పేర్లు, కొత్తగా పెళ్లైన వారి పేర్లు నమోదు చేసుకోవొచ్చు’ అని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సివిల్ స్లపై అధికారులు తీవ్రంగా స్పందించారు.

సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అంతా ఫేక్.. ఎవరూ నమ్మవొద్దు అంటూ కీలక ప్రకటన చేశారు సివిల్ సప్లై శాఖ అధికారులు. రేషన్ కార్డుల్లో సవరణలు, పేర్లు నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందనే వాట్సాప్ వార్తలు రావడంతో ప్రజలు రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని..ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం అఫిషియల్ గా ప్రకటన చేస్తుందని అన్నారు.