Dharani
కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం పండుగ ముందు షాప్‌లు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. అయిలే ఇలా ఆఫర్ ప్రకటించి.. నిండా మునిగాడు ఓ షాప్ యజమాని. ఆ వివరాలు..
కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం పండుగ ముందు షాప్‌లు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. అయిలే ఇలా ఆఫర్ ప్రకటించి.. నిండా మునిగాడు ఓ షాప్ యజమాని. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా పండుగల వేళ, శ్రావణ, ఆషాఢ మాసాల్లో.. బట్టల షాపులు ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయి. 50 శాతం తగ్గింపు ధర అంటేనే మన వాళ్లు ఆగరు.. అలాంటిది రూపాయికే చీర అంటే ఇంకేమైనా ఉందా.. ఆఫర్ గురించి తెలిస్తే.. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు సైతం షాపు వద్దకు క్యూ కడతారు. రద్దీ తట్టుకోలేక మధ్యలోనే షాపు ముసివేయాల్సిన పరిస్థితి తలెత్తుంది. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. రూపాయికే చీర అంటూ బంపరాఫర్ ప్రకటించింది ఓ దుకాణం. అయితే ఈ ఆఫర్ వల్ల సదరు షాపు యజమానికి భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
భద్రాచలం, అంబేడ్కర్ సెంటర్‌లోని ఓ రెడీమేడ్ బట్టల దుకాణం.. సంక్రాంతి సందర్బంగా ఓ బంపరాఫర్ ప్రకటించింది. మహిళలకు ఒక్క రూపాయి ధరకే చీర అందిస్తామని సదరు దుకాణం యజమాని ప్రకటించారు. ఆఫర్ గురించి ఆ ప్రాంత ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా తెలియడంతో.. మహిళలు షాప్ వద్దకు క్యూ కట్టారు. దుకాణం తెరవకముందే.. భారీ ఎత్తున మహిళలు షాపు ముందు క్యూ కట్టారు. ఇక షాప్ తెరవగానే ఒక్కసారిగా వందలాది మంది మహిళలు దుకాణంలోకి చొచ్చుకుపోయారు.
ఇంత భారీ ఎత్తున జనాలు వస్తారని ఊహించని షాపు యజమాని రద్దీని కట్టడి చేయలేకపోయాడు. దాంతో సమనం కోల్పోయిన దుకణాదారు.. అక్కడున్న చీరలను మహిళలపైకి విసిరివేసినట్లు తెలిసింది. లోపలికి చొచ్చుకుపోయిన వారిలో కొందరు ఇదే అదునుగా తమ చేతివాటం ప్రదర్శించి చేతికి అందిన కొన్ని ఖరీదైన చీరలనూ తీసుకెళ్లినట్టు తెలిసింది.
విషయం తెలియడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళలను దుకాణం నుంచి బయటకు పంపారు.సేల్స్ పెంచుకోవడం కోసం ఈ ఆఫర్ ప్రకటిస్తే.. అది తనకు ఇలా నష్టం చేకూరుస్తుందని అస్సలు అనుకోలేదన్నాడు షాప్ యజమాని. తాను ఒకటి అనుకుంటే మరో విధంగా జరిగిందని పోలీసుల ఎదుట వాపోవడం యజమాని వంతయిందట.