Arjun Suravaram
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన దీనికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అందుకే మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యానికి సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన దీనికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అందుకే మద్యం కొనుగోలు చేయడంతో పాటు మద్యానికి సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్.
Arjun Suravaram
నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. చాలా మంది ఆదివారం వచ్చిందంటే మందు తాగుతూ వీకెండ్ ను ఎంజాయ్ చేస్తారు. ఇక మరికొందరికి అయితే మద్యం తాగనిదే రోజూ ప్రారంభం కాదు. ఇక ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు అంటే..మందు తప్పనిసరిగా ఉండాలి. వైను, బీర్లు తాగుతూ మద్యం ప్రియులు ఎజాయ్ చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే వేసవి కాలంలో బీర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలోనే మద్య ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సమ్మర్ చల్లని బీర్లు తాగేందు మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. ఇలానే ఈ కాలంలో బీర్ల విక్రయం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చల్లని బీరు తాగాలని ఆశించే మద్యంప్రియులకు బీర్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలోని మద్యం డిపోకు బీర్ల సప్లయ్ చాలావరకు నిలిచి పోయిందని సమాచారం. ఇప్పటికే వచ్చిన బీర్ల నిల్వలను డిపో పరిధిలోని వైన్ షాపులకు, బార్లకు రేషియో పద్ధతిన సప్లయ్ చేశారు. దీంతో బీర్లకు కొరత ఏర్పడింది. అలానే మరికొద్ది రోజుల్లో ఈ కొరత తీవ్రం కానున్నట్లు సమాచారం. గతంలో ప్రభుత్వ లిక్కర్ డిపోలాకు పలు కంపెనీలు సరఫరా చేసిన బీరు నిల్వలకు బకాయిల చెల్లింపులో జాప్యమే జరిగిందని, ఆ కారణంగానే బీర్ల కోరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
గుడిపేట మద్యం డిపో పరిధిలోని వైన్ షాపులు నిత్యం కళకళలాడుతూ కనిపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా వెల వెలబోతున్నాయని మద్యం ప్రియులు చెబుతున్నారు. పలు మద్యం కంపెనీలు బీరు సప్లయ్ ను తగ్గించడంతో వాహనాల రాకపోకలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు 20 వాహనాలకు పైగా మద్యాన్ని సప్లయ్ చేసేందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం 10 వాహనాలు కూడా డిపోకు రావడం లేదు.
వేసవిలో మార్చి నుంచి మే వరకు దాదాపు రూ.2కోట్ల ఖరీదైన బీర్ల విక్రయం జరుగుతాయి. ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు సుమారుగా 50 బీరు కేసుల వరకు అమ్మకాలు జరిగేవి. కానీ ఈ సారి వేసవిలో మాత్రం 30 బీరు కేసుల వరకు కూడా సరఫరా చేయడం లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో బీర్ల కొరత తీవ్రం కానుంది. అయితే ఈ కొరత అనేది కేవలం గుడిపేట డిపో పరిధిలోని మద్య ప్రియులకు మాత్రం అని తెలుస్తోంది.