iDreamPost
android-app
ios-app

Barrelakka: కోల్లాపూర్‌లో ఓటమి దిశగా బర్రెలక్క.. ఇన్ని తక్కువ ఓట్లా!

  • Published Dec 03, 2023 | 12:37 PM Updated Updated Dec 03, 2023 | 12:37 PM

Barrelakka Takes The Lead in Kollapur: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా కొనసాగుతుదంి. పోస్టల్ బ్యాలెట్కౌం టింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజలో ఉన్నా.. తర్వాత పరిణామాలు మారిపోయాయి.

Barrelakka Takes The Lead in Kollapur: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా కొనసాగుతుదంి. పోస్టల్ బ్యాలెట్కౌం టింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజలో ఉన్నా.. తర్వాత పరిణామాలు మారిపోయాయి.

  • Published Dec 03, 2023 | 12:37 PMUpdated Dec 03, 2023 | 12:37 PM
Barrelakka: కోల్లాపూర్‌లో ఓటమి దిశగా బర్రెలక్క.. ఇన్ని తక్కువ ఓట్లా!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం మారిపోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ హవా కొనసాగుతూ వచ్చింది. ఒకదశలో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలో లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో అంచనాలు పూర్తిగా తారు మారు అయ్యాయని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. అధికార పీఠం ఎవరు దక్కించుకుంటారు అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. ఇక నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తొలి రౌండ్ లో ఆదిపత్యం లో కొనసాగినా.. అనూహ్యగా ఆధిపత్యాన్ని కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన నేతలు ఎన్నికల బరిలో నిలబడతారు. వారికి పోటీగా స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన వారే ఉంటారు. అయితే మొదటిసారిగా ఒక సామాన్యురాలు..యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన యువతి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడింది. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తాను పోటీ చేస్తున్నా అంటూ ప్రచారం చేసింది. ఆమెకు వివిధ వర్గాల నుంచి మంచి మద్దతు కూడా లభించింది. మొత్తానికి తన నామినేషన్ తో దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది బర్రెలక్క. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా ప్రచారం చేసింది. ఉదయం కొల్లాపూర్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

విజిల్ గుర్తుతో ఎన్నికల బరిలో దిగిన శిరీష   తొలిరౌండ్ లో 473 ఓట్లు కౌంట్ తో ముందంజలో ఉండటంతో అందరి చూపు ఆమెపై పడింది. కానీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.. రెండో రౌండ్ లో ఆమె కేవలం 262 ఓట్లకే పరిమితం అయ్యింది. మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష కేవలం 1000 ఓట్ల లోపు ఓట్లకే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి 9,797 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఆయన గెలుపు ఖాయం అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.