Arjun Suravaram
Barrelakka Sirisha: బర్రెలక్క గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో కోపంతో ఊగిపోయి.. బర్రెలక్క మరోసారి వార్తల్లో నిలిచారు.
Barrelakka Sirisha: బర్రెలక్క గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో కోపంతో ఊగిపోయి.. బర్రెలక్క మరోసారి వార్తల్లో నిలిచారు.
Arjun Suravaram
నేటికాలంలో సోషల్ మీడియాలో ద్వారానే చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కొందరు అయితే ఒక్క వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతున్నారు. అలా జనాల్లో మంచి క్రేజ్ సంపాదించిన వారిలో బర్రెలక్క ఒకరు. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఎన్నికల సమయంల శిరీషాపై ఆమె తండ్రి అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో తనపై ఫేక్ వీడియోలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘హాయ్..ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కను’ అంటూ నిరుద్యోగంపై శిరీషా చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. అంతేకాక నిరుద్యోగులందరూ బర్రెలక్కకు మద్ధతుగా నిలిచారు. ఈ సమయంలో శిరీషాపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో మరోసారి వార్తల్లో నిలిచారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ప్రధాన పార్టీ ఆభ్యర్థులకు ధీటుగా ఆమెకు ప్రజల నుంచి స్పందన వచ్చింది. అంతేకాక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు భారీగా మద్దతు లభించింది. చాలా మంది ఆమె ఎన్నికల ప్రచారం కోసం విరాళం సైతం ఇచ్చారు. ఇక తాను గెలిస్తే ఏం చేస్తాను వివరిస్తూ.. బర్రెలక్క వీడియోలు చేసింది.
ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారంలో ఫుల్ జోరు మీద ఉండగా.. ఆమె తండ్రి మాట్లాడిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. తన కూతురు అంత ఫేక్ అని, ఆమెకు పెళ్లి చేస్తే.. భర్తతో విభేదించి.. దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాక బర్రెలక్కపై ఆమె తండ్రి అనేక ఆరోపణలు చేశారు. దీంతో మంచి క్రేజ్ సంపాందిచిన ఆమె.. ఆ వీడియోతో కాస్తా ఢీఫేమ్ అయింది. ఆ ఎన్నికల్లో ఆమె కేవలం ఐదు వేల పై చిలుకు ఓట్లు మాత్రమే సాధించింది. తాజాగా తనపై అసత్య ఆరోపణలు చేసిన విషయంపై బర్రెలక్క మరోసారి వార్తల్లో నిలిచారు. తన తండ్రితో వీడియో చేయించిన యూట్యూబ్ ఛానల్, సదరు వ్యక్తిపై ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు బర్రెలక్కను ఎప్పుడు ఇలా చూసి ఉండరంటూ.. ఈ వీడియో చూసిన వాళ్లు అభిప్రాయా పడుతున్నారు.
వైరల్ అవుతోన్న వీడియోలో బర్రెలక్క మాట్లాడుతూ..”నువ్వు మా ఫాదర్ తో వీడియో తీశావు. నువ్వు ఎవరు నా గురించి వీడియో తీయడానికి. నాపై అసత్య ఆరోపణలతో వీడియో ఎందుకు చేశావు. ఈయనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. వీడి వల్లన నేను ఎంతో నరకం అనుభవించాను. నాతో పాటు ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు. ఆ వీడియో తీసి నా పరువు మొత్తం తీశాడు. నా తండ్రి వద్దకు వెళ్లి డబ్బులిచ్చి వీడియో తీయించాడు. నేను దొంగదానిని అన్నావు. నన్ను ఏ గుడిలో దొంగతనం చేస్తుంటే చూశావు. నేను ప్రచారం డబ్బుల కోసం చేశానా?. నా తండ్రి ఓ పిచ్చొడు… ఇంట్లో నుంచి వెళ్లిపోతే.. వాడికి డబ్బులు ఇచ్చి.. తాగించి..నా పై వీడియో తీయించారు. ఎన్నికల్లో నాకు ఓట్లు తగ్గడానికి కారణం వీడు” అంటూ బర్రెలక్క కోపంతో ఊగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.