Krishna Kowshik
మద్యం అంటే మందుబాబులకు ఓ ఎమోషన్. సాయంత్రం కాగానే.. కడుపు గంట కొట్టేస్తుంది.. గొంతు పలకరిస్తుందేమో కాబోలు.. ఠంచనుగా మద్యం షాపులోకి వెళ్లి.. పీకల దాకా తాగి.. ఇంటికి బయలు దేరుతారు.. ఏ మాత్రం భయం లేకుండా.. తాజాగా..
మద్యం అంటే మందుబాబులకు ఓ ఎమోషన్. సాయంత్రం కాగానే.. కడుపు గంట కొట్టేస్తుంది.. గొంతు పలకరిస్తుందేమో కాబోలు.. ఠంచనుగా మద్యం షాపులోకి వెళ్లి.. పీకల దాకా తాగి.. ఇంటికి బయలు దేరుతారు.. ఏ మాత్రం భయం లేకుండా.. తాజాగా..
Krishna Kowshik
’మందు బాబులం మాకు మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహా రాజులం‘ అని ఫీల్ అవుతుంటారు మద్యం ప్రియులు. పీకల దాకా తాగడం.. లేవలేకపోతే.. అక్కడే పడి దొర్లడం లేదంటే.. సక్కంగా బండిపై ఇంటికి బయలు దేరుతుంటారు. పోలీసులు పట్టుకుంటారన్న భయం కూడా ఉండదేమో.. స్వయంగా వాహనం నడుపుకుంటూ వచ్చి.. పోలీసుల చేతికి చిక్కుతుంటారు. ఇక అప్పుడు చూడాలి వారి హీరోయిజం.. కొంత మంది వదిలేయమని బతిమాలాడుకుంటే.. ఇంకొకరు రెచ్చిపోతుంటారు. నాకు వీడు తెలుసు.. వాడు తెలుసు అంటూ పోలీసులకే చుక్కలు చూపిస్తుంటారు. కానీ ఈ మందు వీరుడు.. నాలుగు డిగ్రీలు ఎక్కువే చదివాడు.
ఏకంగా పోలీసులపైకే దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. హైదరాబాద్ అమీర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆటో డ్రైవర్‌ను తనిఖీ చేశారు. ఫూటుగా మద్యం సేవించాడని తేలింది. అంతలో.. పోలీసులపై బూతులు తిడుతూ విరుచుకు పడ్డాడు. ట్రాఫిక్ పోలీసుల మీదే చేయిచేసుకోబోయాడు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పీక పట్టుకుని.. అతడిపై దాడి చేశాడు. అక్కడ ఉన్న మిగిలిన పోలీసులతో గొడవ పడ్డాడు మందు బాబు. దీంతో అక్కడ ఉన్నవారంతా అతడిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
అమీర్పేట ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడి ట్రాఫిక్ పోలీసుల మీద దాడి చేసిన ఆటో డ్రైవర్. pic.twitter.com/uX8KiDKRQJ
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2024