Dharani
రోడ్డు మీద ఎదురుగా మీకు లక్ష రూపాయలు కనిపించాయి ఏం చేస్తారు.. మీరే తీసుకుంటారా.. పోలీసులకు అందిస్తారా.. కానీ ఈ మహిళ మాత్రం ఇదిగో ఇలాంటి పని చేసింది.
రోడ్డు మీద ఎదురుగా మీకు లక్ష రూపాయలు కనిపించాయి ఏం చేస్తారు.. మీరే తీసుకుంటారా.. పోలీసులకు అందిస్తారా.. కానీ ఈ మహిళ మాత్రం ఇదిగో ఇలాంటి పని చేసింది.
Dharani
సాధారణంగా రోడ్డు మీద ఏవైనా వస్తువుల, డబ్బులు వంటివి కనిపిస్తే.. చుట్టూ ఓ సారి చూసి.. వాటికి సంబంధించిన వ్యక్తులు లేరని ఓ అంచానాకు వచ్చాక.. ఎవరూ చూడకపోతే.. వాటిని తీసుకుని చక్కా వెళ్లిపోయే వాళ్లే ఎక్కువ మంది. అయితే అందరూ అలానే ఉండరు. పరుల సొమ్ము పాము అని భావించే నిజాయితీపరులు కూడా ఉంటారు. అలాంటి వారికి ఏవైనా వస్తువులు దొరికినా.. డబ్బులు చూసినా వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాటిని అప్పగించి.. నిజాయితీ చాటుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ఇందుకు భిన్నమైంది. బస్సు దిగుతుండగా ఓ వ్యక్తి వద్ద ఉన్న లక్ష రూపాయల నోట్ల కట్ట కింద పడింది. అది గమనించుకోకుండా వెళ్లిపోయాడు. ఇక అటుగా వెళ్తున్న మహిళ డబ్బు కట్ట చూసి ఏం చేసిందంటే..
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఆర్టీసీ బస్సు డిపో వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు రోడ్డు మీద లక్ష రూపాయలు దొరికాయి. ఆ డబ్బు ఎవరిదో అడిగి వారికి ఇచ్చేయకుండా.. వాటిని తీసుకుని.. భద్రంగా దాచుకుని.. ఆవెంటనే వేగంగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది సదరు మహిళ. సీసీటీవీ కెమరాలో ఇందుకు ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఒక వ్యక్తి బస్సు దిగుతుండగా అతడి నుంచి రూ.లక్ష కట్ట జారి కింద పడిపోయింది. ఆ వ్యక్తి అది గమనించుకోలేదు. ఇంతలో అటుగా వచ్చిన మహిళ రోడ్డు మీద నోట్ల కట్ట పడి ఉండటం గమనించింది. వెంటనే దాన్ని చేతికందుకుని.. చీర కొంగు చాటున దాచుకుని.. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయింది.
ఇలా ఉండగా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు బస్టాండ్ వద్ద సీసీటీవీ రికార్డ్‌ను పరిశీలించగా.. అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ రోడ్డు మీద పడి ఉన్న లక్ష రూపాయల డబ్బు కట్టను అందుకుని వెళ్లడం దాంట్లో రికార్డయ్యింది. సీసీటీవీ వీడియో ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఆ మహిళ కోసం గాలిస్తున్నారు. వీడియో చూసిన నెటిజనులు.. అక్కో నువ్వు మామాలుదానివి కాదు కదా.. నిమిషాల్లో లక్ష నొక్కేసావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాపం డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు ఎంత బాధపడతారో మీకు అర్థం కాలేదా.. అలా ఎలా చేస్తారు.. ఆ డబ్బును పోలీసులకు అప్పగించాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
అచ్చంపేట బస్టాండులో బస్సులో నుండి జారిపడ్డ లక్ష రూపాయలు.. వెంటనే గమనించి ఆ డబ్బులు తీసుకొని వెళ్లిపోయిన మహిళ.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్న పోలీసులు. pic.twitter.com/OKEYKWj5DN
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024