iDreamPost
android-app
ios-app

అమల్లోకి ఎన్నికల కోడ్.. అంతకు మించి డబ్బు వెంట ఉంటే సీజ్!

  • Published Oct 09, 2023 | 2:33 PM Updated Updated Oct 09, 2023 | 2:33 PM
అమల్లోకి ఎన్నికల కోడ్.. అంతకు మించి డబ్బు వెంట ఉంటే సీజ్!

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 5 రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలను వేర్వేరుగా ప్రకటించిన సీఈసీ.. ఫలితాలు మాత్రం అన్ని రాష్ట్రాలకు డిసెంబర్ 3న వెలువరించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులతో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. అయితే ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడం వల్ల ఇక్కడ రెండు పర్యాయాలు పోలీంగ్ జరుగుతుందని రాజ్ కుమార్ తెలిపారు. అంతేకాదు నేటి నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అన్నారు.

సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇక అక్టోబర్ 9 సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వాల పరంగా ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకూడదు, అధికారిక ప్రకటనలు, కొత్త జీవోలు జారీ చేయడానికి వీలు లేదు అని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఇది డిసెంబర్ 5 వరకు అమల్లో ఉంటుందని సీఈసీ రాజ్ కుమార్ తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సందర్భంగా సామాన్యులు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సూచిస్తున్నారు అధికారులు. మీ వెంట అధిక మొత్తంలో డబ్బులను తీసుకువెళ్లే ఛాన్సు ఉండదు. ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. 50 వేల రూపాయలకు మించి మీరు ఎక్కడికైనా డబ్బు తీసుకు వెళ్తే దానికి సంబంధించిన రసీదు, ఇతర డాక్యుమెంట్లు తప్పకుండా ఉండాలి. అలా లేని పక్షంలో మీరు డబ్బు, వస్తువులతో తనిఖీల్లో దొరికినట్లయితే ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ డబ్బు సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిసే వరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వరు. అప్పుడు కూడా సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇది దృష్టిలో పెట్టుకొని అధిక డబ్బు తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటున్నారు. అంతేకాదు.. బంగారం, వెండి ఆభరణాలు అధిక మొత్తంలో తీసుకువ వెళ్తున్నట్లైతే సరైన పత్రాలు మీ వెంట ఉంచుకోవడం మంచిది.. లేదంటే సీజ్ చేస్తారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని డబ్బు, బంగారం ఇతర ఖరీదైన వస్తువుల ఎక్కడికైనా తరలించాలని అనుకుంటే కోడ్ ఉన్నంత వరకు మీ వెంట సరైన పత్రాలు ఉంచుకోవడం తప్పని సరి.. లేదంటో చిక్కుల్లో పడటం ఖాయం.