వాహనదారులకు బిగ్ అలెర్ట్.. 24 గంటల పాటు ట్యాంక్ బండ్ బంద్!

వాహనదారులకు బిగ్ అలెర్ట్.. 24 గంటల పాటు ట్యాంక్ బండ్ బంద్!

ట్యాంక్ బండ్ 24 గంటల పాటు మూతపడనుంది. సాధారణ వాహనాలను ఆ దారిలో అనుమతించబోమని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్యాంక్ బండ్ 24 గంటల పాటు మూతపడనుంది. సాధారణ వాహనాలను ఆ దారిలో అనుమతించబోమని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్యాంక్ బండ్.. హైదరాబాద్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్లేస్. నైట్ అవుట్ చేయడానికి, బర్త్ డే పార్టీలు చేసుకోవడానికి నగర జనాభా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే ప్లేస్. అయితే ఇప్పుడు అక్కడ కేక్ కటింగ్స్ కు అనుమతి లేదు. హైదరాబాద్ తొలిసారి వచ్చినవారు ట్యాంక్ బండ్ చూసే వెళ్తారు. దాంతో అక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది. అలాంటి ట్యాంక్ బండ్ 24 గంటల పాటు మూతపడనుంది. సాధారణ వాహనాలను ఆ దారిలో అనుమతించబోమని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. వాహనదారులు మళ్లించిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని గమ్యస్థానాలకు చేరాలని పోలీసులు సూచిస్తున్నారు.

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం కావడంతో.. ఆ వేడుకలను ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం అర్థరాత్రి వరకు సాధారణ వాహనాలను ట్యాంక్ బండ్ పైకి అనుమతించడం లేదని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. సికింద్రాబాద్, రవీంద్ర భారతీ, ఎన్టీఆర్ మార్గ్, జీఎచ్ఎంసీ కార్యాలయం ముందు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ మార్గాల్లో వచ్చేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.

రాష్ట్ర అవతరం దినోత్సంవంలో భాగంగా వేడుకల కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ తదితర ప్రాంతాల్లోని అమరవీరుల స్థూపం వద్ద వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిహార్సల్స్ జరుగుతున్న మార్గాల్లో రాకుండా.. వేరే మార్గాల్లో వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు గన్ పార్క్ వైపు ట్రాఫిక్ అనుమతించడబడదు.  నాంపల్లి టి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపు కాకుండా బషీర్‌బాగ్ BJR విగ్రహం వైపు మళ్లిస్తారు. అలాగే హుస్సేన్‌నగర్ ప్రాంతంలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబడతాయని అధికారులు పేర్కొన్నారు. ఇవే కాకుండా.. రాష్ట్ర అవతరం దినోత్సవం సందర్బంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని తెలుసుకొని, ఇబ్బందులు పడకుండా వాహనదారులు ప్రయాణించాలని ట్రాఫిక్ అధికారులు పేర్కొంటున్నారు.

Show comments