iDreamPost
android-app
ios-app

దేశసేవ చేయాలని ఆర్మీకి వెళ్లిన తెలంగాణ మహిళా జవాన్.. బార్డర్​లో డ్యూటీ చేస్తూ..!

దేశానికి ఎంతో చేయాలనుకుంది గంగా భవాని. ఎంతో ఇష్టంగా ఉద్యోగంలో చేరింది. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుంది. కానీ అనూహ్యంగా...

దేశానికి ఎంతో చేయాలనుకుంది గంగా భవాని. ఎంతో ఇష్టంగా ఉద్యోగంలో చేరింది. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుంది. కానీ అనూహ్యంగా...

దేశసేవ చేయాలని ఆర్మీకి వెళ్లిన తెలంగాణ మహిళా జవాన్.. బార్డర్​లో డ్యూటీ చేస్తూ..!

దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా గుండెలపై చేయి వేసుకుని నిద్ర పోతున్నారంటే.. దానికి కారణం సరిహద్దుల్లో జవాన్లు నిత్యం పహారా కాస్తుండటం వల్లే. కుటుంబ సభ్యులను, తోబుట్టువులను, జీవిత భాగస్వామిని, బిడ్డల్ని, పుట్టిన ఊరిని వదిలేసి దేశం కోసం విధులు నిర్వర్తిస్తుంటారు.  పగలు, రాత్రి అని తేడా లేకుండా.. ఎండ, వాన, చలిని తట్టుకుని దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం పాడుపడుతుంటారు. ప్రాణాలు సైతం లెక్కచేయరు. తాము చనిపోతామని తెలిసి కూడా దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. కానీ సరిహద్దుల్లో పహారా కాస్తూ ప్రాణాలు వదిలేస్తున్నారు.  ఇక పొరుగు దేశాలతో యుద్దాలు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా అనేక మంది జవాన్లు మృతి చెందుతున్నారు.

తాజాగా దేశ సేవ చేయాలన్న ఉద్దేశంతో జవానుగా మారిన ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది. అనూహ్యంగా సరిహద్దుల్లో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తెలంగాణలోని రామగుండం ఎన్టీపీసీ సుభాష్ నగర్‌కు చెందిన బల్ల గంగా భవాని ఆర్మీ జవానుగా గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తుంది. విధి నిర్వహణలో అనూమానాస్పదంగా మృతి చెందింది. ఆమె చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. దేశ సేవ చేయాలన్న సంకల్పంతో ఆర్మీలో చేరిన గంగా భవాని.. అక్కడే మరణించింది. గంగా భవాని మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మహిళా జవాన్ మృతదేహం చేరుకుంటుంది. అధికారులు ఆమె డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.