P Krishna
తెలంగాణ రెండవ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణ రెండవ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
P Krishna
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రెండవది చేయూత పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.10 లక్షల వరకు పెంచారు. సీఎం బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చి ప్రజా వాణి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అంతేకాదు విద్యుత్ శాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇలా పలు సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్మించతలపెట్టిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వం మెట్రో హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో లైన్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్ట్ ని విస్తరించేందుకు అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. తార్నక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలో మీటర్లు, మేడ్చల్ నుంచి పటాన్ చెవు వరకు 29 కిలో మీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెద అంబర్ పేట వరకు మెట్రో కారిడార్ ని విస్తరింపచేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పఠాన్ చెరు నుంచి నార్సింగ్ వరకు 22 కీలోమీటర్లు, బొంగుళూరు, తుక్కుగూడ, పెద అబర్ పేట వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి టెండర్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ పనులకు బ్రేకులు వేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం శాసన సభ్యులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు అభివృద్ది పనుల కార్యాచరణపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ అంశంపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణ అవసరం లేదని.. అది కొంతమంది రియల్టర్లకు లాభం చేకూర్చేందుకు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంగా సీఎం రేవంత్ రెడ్డి భావించినట్లు సమాచారం. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన బెట్టి.. దానికి బదులుగా లక్డీకపూల్-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జేబీఎస్ – ఫలక్ నూమా కారిడార్ పూర్తి చేయడం.. దాన్ని పహాడీ షరీఫ్ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.