కాన్వాయ్ విషయంలో.. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం..!

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనా విషయంలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేశారు. ఆ తర్వాత ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ప్రజల సమస్యలు తెలుసుకునే ‘ప్రజా వాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారానికి రెండు సార్లు ఈ ప్రజా వాణి కార్యక్రమం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కారం జరిగేలా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రచార సమయంలో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల్లో ఒకటి మహాలక్ష్మి పథకం.. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ ప్రయాణం, రెండవది అర్హులైన వారికి రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఎన్నో పకడ్భందీ భద్రతలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ లోని కార్లకు ఒకే కలర్, ఒకే నెంబర్ ప్లేట్లు ఉంటాయి. ప్రయాణ సమయాల్లో కార్లు జంబ్లింగ్ చేస్తూ మారుతూ ఉంటాయి. కారణం ముఖ్యమంత్రి ఏ కారులో ఉన్న విషయం తెలియకుండా ఉండటం కోసం ఇలా చేస్తుంటారు. దీని వల్ల ఎవరైనా దాడి చేయాలని చూసేవారికి సీఎం ఏ కార్లో ఉన్నారో అర్థం కాదు.. సెక్యూరిటీ ఇదో భాగం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్ల నంబర్ 0009 గా మార్చారు. సీఎం కారు టీఎస్ 07 ఎఫ్ ఎఫ్ 0009 నంబర్ కేటాయించారు. మిగిలిన కార్లకు టీఎస్ 09 ఆర్ఆర్ 0009 నంబర్ కలిగి ఉన్నాయి. రేవంత్ రెడ్డి తనకు కేటాయించిన బ్లాక్ క్రూయిజర్ వాహనంలో ప్రయాణిస్తుండగా.. ఇతర కాన్వాయ్ కార్లు తెలుగు, సిల్వర్ కలర్ లో ఉన్నాయి. దీని వల్ల ఆయన ఏ కార్లో ప్రయాణిస్తున్నారు అన్న విషయం తెలిసి పోతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాన్వాయ్ లో ఉండే కార్లు మొత్తం ఒకే రంగులో ఉండాలి.. వాటి నంబర్ ప్లేట్ ఒకే సిరీస్ లో ఉండాలని, కాన్వాయ్ లో ఉన్న కార్లకు నలుపు రంగు వేయించాలని ఆదేశించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో అన్నీ వైట్ కలర్ కార్లు ఉన్నాయి.. వాస్తవానికి రేవంత్ రెడ్డి నలుపు రంగు అంటే ఇష్టమని అంటున్నారు. అందుకే ఆయన కాన్వాయ్ లో కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్ లో ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో 8 తెలుపు రంగు టయోటా ట్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని బుల్లెట్ ప్రూఫ్ తో సిద్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments