iDreamPost
android-app
ios-app

బయటపడ్డ మరో పురాతన విగ్రహం.. రైతు ఏం చేశాడంటే..?

ఎప్పటి నుండో భూమిలో నిక్షిప్తమైన పురాతన విగ్రహాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మొన్న కర్ణాటకలోని రాయ్ చూర్ లో కృష్ణానదిలో విష్ణు విగ్రహం, శివలింగం బయటకు వచ్చాయి. తాజాగా తెలంగాణలో

ఎప్పటి నుండో భూమిలో నిక్షిప్తమైన పురాతన విగ్రహాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మొన్న కర్ణాటకలోని రాయ్ చూర్ లో కృష్ణానదిలో విష్ణు విగ్రహం, శివలింగం బయటకు వచ్చాయి. తాజాగా తెలంగాణలో

బయటపడ్డ మరో పురాతన విగ్రహం.. రైతు ఏం చేశాడంటే..?

ఎన్నో ఏళ్ల నుండి భూమిలో మరుగున పడిన పురాతన విగ్రహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న రాయచూర్ జిల్లాలోని కృష్షా నదిలో ఏన్నో ఏళ్ల నాటి విష్ణు విగ్రహంతో పాటు శివలింగం బయట పడిన సంగతి విదితమే. దేవసుగూర్ గ్రామానికి సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో ఈ విగ్రహాలు బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో మరో పురాతన విగ్రహం బయటపడింది. కరీంనగర్ జిల్లాలో ఓ పొలంలో ఓ రైతుకు లభించింది.

పొలం పనుల నిమిత్తం రైతు వ్యవసాయ భూమి దున్నుతుండగా.. జైనుల కాలం నాటి పురాతన విగ్రహం బయట పడింది. వెంటనే పురావస్తు శాఖకు సమాచారం అందించాడు రైతు. గంగాధర మండలం కోట్ల నర్సింహుల పల్లిలో ఓ రైతు పంట వేసేందుకు ట్రాక్టరుతో పొలం దున్నుతున్నాడు. అంతలో దున్నిన భూమి నుండి రాయి శబ్దం రావడంతో చివరకు ఏంటా అని దిగి చూడగా.. పురాతన విగ్రహం బయట పడింది. తీరా అది చూడగా.. వెంటనే స్థానికులకు ఆ తర్వాత పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.

కాగా, అధికారులు అది జైన మతం కాలానికి చెందినదిగా గుర్తించారు. కాగా, ఇదే జిల్లాలో గతంలో కూడా పొలాల్లో జైనుల కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. మూడేళ్ల కిత్రం ఇదే గ్రామంలో వర్థమాన మహా వీరుని విగ్రహం బయటపడింది. ఒగ్గు అంజయ్య అనే రైతు పొలం దున్నే సమయంలో బయటపడింది. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో జైన మత ప్రాచుర్యంలో ఉన్న సమయంలో మహావీరుని విగ్రహాన్ని ఆ గ్రామంలోని గుడిలో ప్రతిష్టించినట్లు భావిస్తున్నారు . దాన్ని పురావస్తు శాఖ అధికారులు భద్ర పరిచారు.   2017లో కూడా ఇలాంటి విగ్రహమే బయట పడింది.