iDreamPost
android-app
ios-app

వీడియో: HYDలో షాకింగ్ ఘటన.. మహిళ ఇంట్లో ఉండగా చొరబడి..

  • Published Mar 04, 2024 | 9:42 PM Updated Updated Mar 04, 2024 | 9:42 PM

హైదరాబాద్ మహానగరంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి దూరాడు. ఈ ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

హైదరాబాద్ మహానగరంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి దూరాడు. ఈ ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

  • Published Mar 04, 2024 | 9:42 PMUpdated Mar 04, 2024 | 9:42 PM
వీడియో: HYDలో షాకింగ్ ఘటన.. మహిళ ఇంట్లో ఉండగా చొరబడి..

హైదరాబాద్ వాసులకు షాకిచ్చే ఘటన చోటుచేసుకుంది. ఇటీవల పిల్లలను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ పలు చోట్ల అందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల అనుమానితులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల మధ్య మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిజాంపేట బాచుపల్లిలో ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. మహిళ ఇంట్లో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి దూరిన అపరిచితున్ని చూసి ఆ మహిళా ఒక్కసారిగా షాక్ గురైంది. అంతటి టెన్షన్ వాతావరణంలో కూడా ఆమె తెలివిగా వ్యవహరించింది. ఫోన్ చేతపట్టుకుని ఈ తతంగాన్నంతా వీడియో తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

బాచుపల్లిలో ఓ వ్యక్తి సరాసరి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి దూరిన ఆ వ్యక్తి ఓ మూలన కూర్చున్నాడు. ఈ సమయంలో ఆ ఇంట్లో ఉన్న మహిళ అతడిని చూసి భయంతో వణికిపోయింది. అయినప్పటికీ ధైర్యం కూడగట్టుకుని ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇంట్లోకి అంటూ అతడిని నిలదీసింది. అప్పుడు నన్ను ఎవరో పాయిజన్ చేశారు, నన్ను చంపడానికి చూస్తున్నారు అని ఆ వ్యక్తి అనడం వీడియోలో రికార్డ్ అయ్యింది. కాగా.. మహిళ ధైర్యం చేయడంతో ఆ వ్యక్తికి వెన్నులో వణుకు మొదలైంది. భయపడిపోయిన అతడు దయచేసి అరవొద్దు మేడమ్ అని వేడుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి 2వ అంతస్తు నుంచి కిందకు దూకి పారిపోయాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఉండే ఒంటరి మహిళలు, వృద్ధులు, గృహిణులు ఈ ఊహించని ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom