iDreamPost
android-app
ios-app

రూ.2 లక్షల రుణమాఫీ పై.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

  • Published Sep 09, 2024 | 1:38 PM Updated Updated Sep 09, 2024 | 1:38 PM

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి, రైతుల అకౌంట్ లో మూడు విడతలుగా నగదును జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి, రైతుల అకౌంట్ లో మూడు విడతలుగా నగదును జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు.

  • Published Sep 09, 2024 | 1:38 PMUpdated Sep 09, 2024 | 1:38 PM
రూ.2 లక్షల రుణమాఫీ పై.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురు చూపులు ఎట్టాకేలకు ఫలించాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్కొక్క హామీలను నేరవేర్చే దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత.. రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ రుణమాఫీ నగదు నేరుగా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా, తొలి విడతలో రూ. లక్ష వరకు, రెండో విడతలో రూ.లక్షన్నర, మూడో విడదలో రూ. 2 లక్షల వరకు రైతులు ఖాతాల్లో నగదు జమచేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ రైతు రుణమాఫీ పై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.

రాష్ట్రంలో రైతుల రుణమాపీ పై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అర్హులైనా రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరిస్తా, త్వరలో వారికి కూడా మాఫీ వర్తింపజేసేలా చూస్తామని అన్నారు. ఇక నుంచి పంట కాలంలోనే రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా ఐదేళ్లు పాటు కాలయాపన చేయబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. మొదటి పంటకాలంలోనే 22 లక్షల మంది రైతులకు రూ.18 కోట్లు ఒకే విడతలో నిధులను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఇకపోతే కొంతమంది రైతులకు మాత్రం సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ కాలేదని, వారికి కూడా త్వరలోనే మాఫీ చేయనున్నమని తెలిపారు. కాగా, ఇప్పటికే రుణమాఫీ కానీ 2.65 లక్షల మంది రైతుల వివరాలను సేకరించిమని త్వరలోనే..  వారందరికీ కూడా ఈ పంట కాలంలోనే రుణమాఫీ వర్తింప చేయనున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

ఇకపోతే రైతుబంధు అమలు విషయంలో.. ప్రజలకు ఇప్పటికే చాలా అపోహలు ఉన్నాయి. అందుకే  పంట సాగు చేసిన రైతులకు, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికే ఈ పథకం వర్తింపజేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే లేనిపోని దుష్పచారాలను అన్నదాతాలు నమ్మి ఆందోళనకు గురి కావొద్దంటూ మంత్రి పేర్కొన్నారు. మరీ, రైతు రుణమాఫీ పై మంత్రి తుమ్మల చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.