iDreamPost
android-app
ios-app

మరోసారి CM కేసీఆర్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనల సమయంలో హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురవుతుంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే సిర్పూర్ లో చోటుచేసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనల సమయంలో హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురవుతుంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే సిర్పూర్ లో చోటుచేసుకుంది.

మరోసారి CM కేసీఆర్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం రసవతర్తంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికలకు  తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీల నాయకులు బిజీబిజీగా ఉన్నారు.  ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనల సమయంలో హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురవుతుంది. తాజాగా కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  సిర్పూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య రావడంతో పైలట్ చాపర్ నిలిపివేశాడు. దీంతో కేసీఆర్ రోడ్డుమార్గంలో ఆసిఫాబాద్ కు బయల్దేరారు.

తెలంగాణ ఎన్నికల పొలింగ్ కి తక్కువ సమయం ఉండటంతో గులాబీ  బాస్ కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు.  ఒకే రోజు పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ..నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఆయన పర్యటన కోసం  హెలికాప్టర్ చాపర్ ను వినియోగిస్తున్నాడు. అయితే ఇది తరచూ సాంకేతిక లోపంతో నిలిచిపోతుంది. ఈనెల 6వ తేదీన సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆరోజు సీఎం పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా దేవరకద్రకు వెళ్తుండగా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే పైలట్ అప్రమత్తం కావడంతో ఫామ్ హౌస్ లో సురక్షితంగా చాపర్ ను ల్యాండింగ్ చేశారు. ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయంగా మరో హెలికాప్టర్ ను సిద్ధం చేయడంతో సమస్య పరిష్కారమైంది. తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్  పర్యటనలో మరోసారి హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇలా వరుసగా హెలికాఫ్టర్ సాంకేతిక లోపానికి గురవతుండటంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.