బ్రేకింగ్: CM రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి తప్పిన ప్రమాదం

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కొడంగల్ పర్యటనలో భాగంగా సీఎం రెవంత్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. అయితే మార్గం మధ్యలో సీఎం కాన్వాయ్ లోని ఓ కారు టైరుకి పంచర్ పడి పేలింది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో టైర్ పంచర్ అయినా కూడా డ్రైవర్ అప్రమత్తతో సీఎం కాన్వాయ్ కి పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయ్యింది. కారు డ్రైవర్ చాకచక్యంగా కారుని పక్కకు తీసేశాడు. ఆ తర్వాత ల్యాండ్ క్రూయిజర్ కారు టైరు మార్చుకుని తిరిగి బయల్దేరారు. సీఎం కారు కాకపోయినా కూడా ముఖ్యంమంత్రి కాన్వాయ్ అంటే నిర్దిష్ట వేగంతో, ఒక కారు వెనుక మరొక కారు ఎంతో వేగంగా వెళ్తూ ఉంటాయి. అలాంటి ఏ కారుకు ప్రమాదం జరిగినా అది మరో కారుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించినట్లు అయ్యింది.

ఈ వార్త విన్న తర్వాత రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. మొదటి టైరు పంచరు పడిందని తెలుసుకుని అంతా కంగారు పడ్డారు. కానీ, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పంచర్ పడిన కారులో ఉన్న వారికి కూడా ఏమీ కాలేదు.. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయ్యింది. పంచరు పడిన కారుకి టైర్ మార్చుకుని తిరిగి కొడంగల్ బయలుదేరారు. ఈ కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మండలాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకోసం కొండగల్ వెళ్తున్న సమయంలోనే కాన్వాయ్ లోని కారు టైరు పంచర్ పడి పేలింది.

మార్చినెలలో కూడా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ వద్ద కాన్వాయ్ లోని 6 కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టాయి. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయ్యింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే మార్చి నెల 17న రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలెట్లు సకాలంలో సమస్యను పసిగట్టి ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే కాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, దీపాదాస్ మున్షీ కూడా అదే విమానంలో ఉన్నారు.

Show comments