iDreamPost
android-app
ios-app

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ.. నిబంధనలు ఇవే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా నేటి నుంచి కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే క్రమంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా నేటి నుంచి కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే క్రమంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ.. నిబంధనలు ఇవే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా నేటి నుంచి కీలక ఘట్టం ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం 11 గంటలకు ఫారం-1 నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే క్రమంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గత నెలలో తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోఅధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఆశావహులు నామినేషన్లు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేయనుండి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల15 చివరితేదీ. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే విధంగా డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

నేటి నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే ఆర్వో రూమ్‌లోకి అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు టైంలో ఆర్వో, ఏఆర్వో ఆఫీసు సమీపంలోని 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. నామినేషన్‌ ప్రక్రియ, ఆఫీసు వెలుపల వీడియో, సీసీటీవి ద్వారా రికార్డు చేస్తారు.

నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒక రోజు ముందు, ప్రతి అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును పర్యవేక్షించడానికి ప్రత్యేక బ్యాంక్ ఖాతాన్ని తెరవాలి.  నామినేషన్‌తో పాటు అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ ఫామ్‌-26లో అఫిడవిట్‌ దాఖలు సమర్పించాలి. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయోచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం సువిధ అనే పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ సమర్పించినప్పటికీ..అభ్యర్థి పత్రాలపై సంతకం చేసి గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ చెందిన అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇతరులకు పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రతిపాదించే వారంతా అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి. నేటి నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు. మరి.. తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన వివరాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş